ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీలో చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలిగాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందిపడుతున్నారు. పొగమంచు వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 398గా ఉండగా..  కనిష్ట ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోయింది. జనవరిలో మరింత చలిగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

For More News..

16 రాష్ట్రాలు బ్యాన్ చేసిన వ్యక్తిని తెలంగాణకు ఆహ్వానిస్తారా?

వాజ్పేయికి ప్రముఖుల నివాళి