బాలికపై అఘాయిత్యం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్

బాలికపై అఘాయిత్యం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లిన బాలికను అనుసరించిన ఐదుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనను సెల్ ఫోన్లో వీడియో తీసి విషయం ఎవరికైనా చెబితే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత 10 రోజులకు ఆ వీడియో చూపి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మరోసారి వీడియో తీసి తోటి విద్యార్థులకు వాట్సప్ లో పంపారు. 

బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో సోమవారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అత్యాచారం, పోక్సో, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కేసు నమోదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తమ వద్ద అలాంటి కంప్లైంట్ ఏదీ రాలేదని చెప్పడం విశేషం.