పట్టాలు దాటుతుండగా ట్రైన్​ ఢీ..12 మంది మృతి

పట్టాలు దాటుతుండగా ట్రైన్​ ఢీ..12 మంది మృతి
  • రైలుకు నిప్పంటుకుందని ప్రచారం..   పట్టాలపై దూకిన ప్యాసింజర్లు

జార్ఖండ్​లో పట్టాలు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

రాంచీ:  జార్ఖండ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  పట్టాలు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ పలువురిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. జాంతారా జిల్లా కలాఝారియ రైల్వే స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో ఈ ఘోరం జరిగింది. యశ్వంత్​పూర్ నుంచి భాగల్​ పూర్ వెళుతున్న అనగా ఎక్స్ ప్రెస్ బుధవారం సాయంత్రం కలాఝారియ స్టేషన్ కు చేరుకుంది. 

అప్పటికే రైలు భోగీలో మంటలు చెలరేగాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు.. పక్కనే ఉన్న పట్టాలపైకి దూకారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఝాఝా ఎక్స్ ప్రెస్ వారి పై నుంచి వెళ్లింది. దీంతో పట్టాలపై దూకిన 12 మంది ప్రయాణికులు స్పాట్​లోనే చనిపోయారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరికొంత మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.