
కన్నూర్: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లోపలి పొరల్లో అద్ది ఎయిర్‌పోర్టులో దిగిండు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి సెక్యూరిటీ చెక్ దాటేస్తనని అనుకున్నడు. కానీ స్కానింగ్‌లో దొరికిపోయి జైలుకు చేరిండు. కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు పట్టుకున్నరు. రూ.14 లక్షల విలువైన 302 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఫారెన్ నుంచి ఓ విమానం ల్యాండ్ అయ్యింది. అందులోంచి దిగిన ప్రయాణికులను అధికారులు చెక్ చేస్తున్నరు. స్కానింగ్ చేస్తుంటే ఓ ప్యాసెంజర్ ప్యాంటులో పసుపు రంగులో అనుమానిత పదార్థం ఉన్నట్లు కనిపించింది. దీంతో ప్యాంట్ విప్పించి చెక్ చేయగా.. లోపల బంగారు పూత బయటపడింది. అందులోంచి బంగారాన్ని వెలికి తీస్తే 302 గ్రాములు లెక్క తేలిందని అధికారులు చెప్పారు.