ఆధార్‌‌ మార్పులకు రూ. 100

ఆధార్‌‌ మార్పులకు రూ. 100
  • ఎన్‌‌రోల్మెంట్‌‌ చార్జీల పెంపు

ఆధార్ ఎన్‌‌రోల్మెంట్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌‌కు సంబంధించి అడ్రస్, వ్యక్తిగత వివరాల మార్పు, వేలిముద్రలు, ఐరిస్ అప్‌‌డేషన్ కోసం ఇక నుంచి రూ. 100 ఇవ్వాల్సి ఉంటుందని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్​ఇండియా(యూఐడీఏఐ) వెల్లడించింది. వివరాల మార్పు మాత్రమే అయితే రూ.50 అవుతుందని, ఆధార్ కార్డు ప్రింట్‌‌ తీసుకోవడానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ​సెంటర్ల నిర్వాహకులకు యూఐడీఏఐ ఇచ్చే రేట్లనూ పెంచింది.

రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌

మన రాష్ర్టంలో ఇప్పటికి 3.93 కోట్ల మంది ఆధార్ నమోదు చేసుకున్నారు. ​‘రాష్ట్రంలో నివాసం ఉండే వారిలో 90 శాతానికిగా ఆధార్ ఎన్‌‌రోల్‌‌మెంట్ పూర్తయింది. వీళ్లలో 15 ఏండ్ల లోపు వాళ్లు 3.2 శాతమే ఉన్నారు. అందరి వివరాలు ఎన్‌‌రోల్ చేయాల్సి ఉంది’ యూఐడీఏఐ అధికారి ఒకరు తెలిపారు.