ఒకటి రెండు రోజుల్లో ‘ప్రారంభ్ మిషన్’ ప్రయోగం

ఒకటి రెండు రోజుల్లో ‘ప్రారంభ్ మిషన్’ ప్రయోగం

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేట్​ రాకెట్​ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సహకారంతో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్​ కంపెనీ ‘స్కైరూట్​ ఏరోస్పేస్’ తయారు చేసిన రాకెట్​ ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్​ 12 నుంచి 16 మధ్యలో చేపట్టబోయే ఈ ప్రయోగంతో స్కైరూట్​ కంపెనీ చరిత్ర సృష్టించనుంది. వాణిజ్య అవసరాలు తీర్చేలా  విక్రమ్’స్​ రాకెట్​ ను తయారుచేసినట్లు స్కైరూట్​ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్​స్ట్రేషన్​ మాత్రమేనని, ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నామని కంపెనీకి చెందిన శిరీష్​ పల్లికొండ వివరించారు. కంపెనీ నుంచి పంపించే తొలి రాకెట్​ కావడంతో ఈ ఆపరేషన్​ను ‘ప్రారంభ్​ మిషన్’ గా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాకెట్​ లాంచింగ్​ కు సంబంధించి ఫైనల్​ డేట్​గురించి ఇంకా తమకు సమాచారం అందలేదని శిరీష్​ చెప్పారు.

మూడు రకాల రాకెట్లు..

విక్రమ్​ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నట్లు స్కైరూట్​ కంపెనీ వెల్లడించింది. 

విక్రమ్​ 1: పేలోడ్​ బరువు 480 కిలోలను లో ఎర్త్​ ఆర్బిట్​ లోకి మోసుకెళుతుంది.
విక్రమ్​ 2: ఇందులో 595 కిలోల పేలోడ్​ ను అంతరిక్షంలోకి తీసుకెళుతుంది.
విక్రమ్​ 3: భూమి పైనుంచి 815 కిలోల పేలోడ్​ను స్పేస్​లోకి 500 కి.మి. వరకు తీసుకెళుతుంది.

చాల థ్రిల్లింగ్​గా ఉంది.. పవన్​ చందన

శ్రీహరికోటలోని సతీశ్​ధావన్​ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి విక్రమ్​1 రాకెట్​ స్పేస్​ లోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం థ్రిల్లింగ్​ ఉందని స్కైరూట్​ సహ వ్యవస్థకుడు పవన్​ చందన ట్వీట్​ చేశారు. మన దేశంతో పాటు వివిధ దేశాల స్టూడెంట్లు తయారుచేసిన శాటిలైట్లను ఈ రాకెట్​లో పంపిస్తున్నట్లు వివరించారు.