వేటగాళ్ల ఉచ్చుకు ..గ్రేహౌండ్స్ కమాండర్‌ బలి

వేటగాళ్ల ఉచ్చుకు ..గ్రేహౌండ్స్ కమాండర్‌ బలి
  •     భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో ఘటన
  •     వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగకు తగిలి మృతి  

కాటారం, వెలుగు :  వేటగాళ్ల పెట్టిన ఉచ్చుకు ఓ గ్రేహౌండ్‌ కమాండో బలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని న స్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో గ్రేహౌండ్స్ దళా లు అడవిలో కూంబింగ్ నిర్వహించడానికి కాటారం, మహదేవపూర్ మండలాల అటవీ ప్రాంతానికి వచ్చారు. నస్తూర్​పల్లి అటవీ ప్రాంతంలో కూంబిం గ్ చేస్తుండగా, అందులో 2012 బ్యాచ్​కు చెందిన ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలం రాజోలుగూడకు 

చెందిన గ్రేహౌండ్ ​జూనియర్​ కమాండ్​ ఆడె ప్రవీణ్ (33) కాలుకు వేట గాళ్లు అమర్చిన విద్యుత్ వైర్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ప్రవీణ్​ను హాస్పిటల్​కు తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రవీణ్​కు భార్య లత, హర్ష, వివాన్ కుమారులున్నారు. కమాండో మృతి విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

అదుపులో ముగ్గురు వ్యక్తులు?

కాటారం మండలం నస్తూరిపల్లి అటవీ ప్రాం తంలో విద్యుత్ తీగలు పెట్టిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమా చా రం. ఆ ముగ్గురు కాటారం మండల కేంద్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.