కానిస్టేబుల్​ జాబ్స్ నోటిఫికేషన్​పై హైకోర్టుకు ‘మహా’ సర్కారు వివరణ

కానిస్టేబుల్​ జాబ్స్ నోటిఫికేషన్​పై హైకోర్టుకు ‘మహా’ సర్కారు వివరణ

ముంబై: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌‌‌‌జెండర్లు అప్లై చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఫిబ్రవరి, 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్‌‌‌‌ల ప్రమాణాలను రూపొందిస్తామని పేర్కొంది. సీజే ​జస్టిస్ దీపాంకర్ దత్తా, ​జస్టిస్​అభయ్ అహుజాతో కూడిన డివిజన్ బెంచ్.. ‘మహారాష్ట్ర సర్కారు గాఢ నిద్రలో ఉందని, ట్రాన్స్‌‌‌‌జెండర్ల రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రాసెస్​లో నిబంధనలు రూపొందించడంలో వెనుకబడింది’అని ఆగ్రహం వ్యక్తంచేసిన మరుసటిరోజు ప్రభుత్వం స్పందించింది. ఆన్‌‌‌‌లైన్ దరఖాస్తు ఫారమ్‌‌‌‌లో 'సెక్స్' కేటగిరీలో ట్రాన్స్‌‌‌‌జెండర్ల కోసం మూడో డ్రాప్-డౌన్‌‌‌‌ను చేర్చడానికి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సవరించనున్నట్లు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని బెంచ్​కు వివరించారు. అప్లికేషన్​ ఫాంలు అందజేయడానికి అందరికీ లాస్ట్ డేట్​ను డిసెంబర్ 15 వరకు పొడిగించినట్టు తెలిపారు. డిసెంబర్ 13 నాటికి, మూడో డ్రాప్ డౌన్ యాడ్​ చేస్తామని ఏజీ చెప్పారు.