మాస్క్ ‌ఈజ్ ‌‌మస్ట్

మాస్క్ ‌ఈజ్ ‌‌మస్ట్

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? మందెప్పుడు వస్తుంది? సాధారణ జీవనంలోకి వెళ్లాలంటే ఇంకెన్నాళ్లు పడుతుంది? ఈ అంశాలన్నింటిపైనా డా. శ్రీనాథ్ రెడ్డితో వీ6 న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ సంగప్ప చేసిన ఇంటర్వ్యూ విశేషాలు…

-కరోనా వ్యాక్సిన్ త్వరగా వస్తే బాగుండు. ఈ మహమ్మారి నుంచి బయట పడొచ్చని ఎదురుచూస్తున్నారంతా. నిజంగా ఇప్పట్లో
వ్యాక్సిన్ వస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా 200 ల్యాబ్స్ లో వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, హ్యూమన్ ట్రయల్స్ ఇంకా తక్కువే. ఏ వ్యాక్సిన్ తయారు చేయాలన్నా మూడు ఫేజ్ లు ఉంటాయి. ఇప్పుడు రెండు ఫేజుల్లో జరుగుతున్నాయి. మూడో ఫేజ్ చాలా ముఖ్యమైనది. వ్యాక్సిన్ లో మూడు విషయాలు మనం గమనించాలి. రోగనిరోధకం, సేఫ్టీ అంటే సైడ్ ఎఫెక్స్ట్, డ్యూరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చే యాంటీ బాడీస్ మన శరీరంలో ఎన్నాళ్లు ఉంటాయని. ఇప్పుడు కోలుకున్నవాళ్ల‌లో యాంటిబాడీస్ మూడు నెలల్లోనే క్షీణిస్తున్నాయి. మనం యాంటీబాడీస్ పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. వ్యాధి నిరోధకతకు యాంటీబాడీస్, టీ సెల్ ఇమ్యూనిటీ అనే రెండు రక్షణ సెల్స్ ఉంటాయి. యాంటీబాడీస్ క్షీణించినా టీ సెల్ బలంగా ఉంటే నేచురల్ ఇమ్యూనిటీ ఇచ్చి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఈ అంశంలన్నింటి పైనా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని పరీక్షలు నెగ్ వ్యాక్ గిసిన్ బయటకు రావడానికి ఇంకో ఆరు నెలలైనా పడుతుంది. కొంత మందేమో రెండు మూడు నెలల్లో తెస్తామంటున్నారు. తొందరపడితే లాభం లేదు. కొత్త వైరస్ కాబట్టి ఎవరిదగ్గరా ఈ వ్యాక్సిన్ లేదు. ప్రపంచం అంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. వ్యాక్సిన్ పెద్ద ఎత్తున, తక్కువ ఖర్చుతో తయారు చేసే శక్తి ఇండియాకు ఉంది. కాని తొందరపడితే లాభం లేదు కనీసం ఐదారు నెలలైనా ఎదురు చూడాల్సిందే.

-హెర్డ్ ఇమ్యూనిటీ మన దేశంలో వచ్చే అవకాశం ఉందా?

ఇటీవల వచ్చిన రెండు సర్వే రిపోర్ట్ లో కూ‌‌డా హెర్ ఇడ్ మ్యూనిటికీ మనం చాలా దూరంలో ఉన్నామని స్పష్టంగా చెప్పారు. WHOలో సౌమ్యా స్వామినాథన్ కూడా ఆ విషయమే చెప్పారు… హెర్ ఇడ్ మ్యూనిటీ రావాలంటే 50 నుంచి 60 శాతం వరకు ఇన్ఫెఫెక్షన్ ఉండాలని. కొందరు పరిశోధకులు అయితే 70 శాతం మంది ఇన్ఫెక్ట్ కావాల్సిందే అంటున్నారు. మిగతా 30 శాతం మందిని అది కాపాడుతుంది. కాని హెర్ ఇడ్ మ్యూనిటీ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్లకు రక్షణ ఉండదు. కాబట్టి ఇప్పట్లో మన దగ్గర హెర్ ఇడ్ మ్యూనిటీ అనేది సాధ్యమే కాదు. హెర్ ఇడ్ మ్యూనిటీ వస్తుంది. కానీ, ఎప్పుడనేది చెప్పలేం.

-కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మొదలైందంటున్నారు. అది ఏ స్థాయిలో ఉంది? ఎంత దూరం పోతుంది?

మన అజాగ్రత్త వల్ల వైరస్ బాగా వ్యాపిస్తోంది. అయితే పెద్ద నగరాల్లో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది. చిన్న నగరాల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చాలా తక్కువగా ఉంది. అంటే భారత దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఉందంటే తప్పు. కేవలం పెద్ద నగరాల్లోనే ఉంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

-ఎసింప్టమ్యాటిక్ వాళ్లతో ప్రమాదం ఉండదు అంటున్నారు…

ఎసింప్టమ్యాటిక్, ప్రీ సింప్టమ్యాటిక్ వాళ్ల వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది. వాళ్లు గట్టిగా మాట్లాడినా, పాట పాడినా, అరిచినా వైరస్
వ్యాపిస్తుంది. అందుకే మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్‌‌‌‌ పాటించడం చాలా అవసరం.

-ఈ వైరస్ గాల్లో కూడా వ్యాపిస్తుంది అంటున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఉన్న ఏరియాల్లో …

ఎక్కువగా ఈ వైరస్ డ్రాప్ లెట్ ట్రాన్స్ మిషన్…క్లోజ్డ్ బిల్డింగ్, రూమ్స్, హాల్స్ లో మూడు నుంచి నాలుగు గంటల పాటు గాల్లో ఉండే అవకాశం ఉంది. అందుకే గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. సమూహ ప్రదేశాలైతే కచ్చితంగా ఓపెన్ ఏరియా ఉండాల్సిందే.

-కొందరు సర్జికల్ మాస్కులు, ఇంకొందరు N-95 మంచిదంటున్నారు. మరికొందరు బట్ట మాస్కులు సరిపోతాయి అంటున్నారు.
ఇంతకీ ఏ మాస్క్ బెటర్?

మాస్క్ పెట్టుకోవడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మన శరీరంలో వైరస్ ఉండి మనం దగ్నాగి , తుమ్మినా వేరేవాళ్లకు వ్యాపించదు. రెండోది ఎదుటి వ్యక్తి నుంచి మనకు వైరస్ వ్యాపించదు. ఏ మాస్క్ పెట్టుకు న్నా కొంచెం అయినా వైరస్ నుంచి కాపాడుతుంది. అందులో డౌట్ లేదు. కానీ, వీలైనంత వరకు సర్కజిల్ మాస్క్ వేసుకుని బయటకు వెళ్తే మంచిది. సర్కజిల్ మాస్క్ దొరక్కపోతే గుడ్డను మలిచి రెండు పొరలుగా కట్టుకున్నా చాలు. N– 95 మాస్కులు సాధారణ ప్రజలకు అవసరం లేదు. కేవలం అవి మెడికల్ ‌‌ఫీల్డ్‌‌లో ఉన్నవాళ్లు మాత్రమే వాడతారు.

సర్ఫేస్ మీద వైరస్ ఎంత సేపు ఉంటుంది?

మెటీరియల్ బట్టి సర్ఫేస్ మీద వైరస్ మనుగడ టైం వేరుగా ఉంటుంది. కార్ బోర్డ్ , పేపర్ మీద కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. స్టీల్, ప్లాస్టిక్ మీద కొంచెం ఎక్కువ రోజులు ఉండే ఛాన్సుంది.

-ప్లాస్టిక్ మీద ఎక్కువ రోజులు బతికి ఉంటుందని అంటున్నారు…

అవును. ప్లాస్టిక్ మీదకొద్దిగ ఎక్కువ అంటే రెండు రోజుల వరకు ఉండొచ్చు. అయితే ఇక్కడో విషయం గమనించాలి వైరస్ పార్టికర్టిల్ ఉంటే వెంటనే ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు. ఈ మధ్య డెడ్ వైరస్ ఉంటే కూడా RT PCR టెస్టుల్లో పాజిటివ్ చూపిస్తోంది. వైరస్ పార్టికర్టిల్ సంఖ్య కూడా ముఖ్యం. కనీసం వెయ్యి వైరస్ లు మన శరీరంలోకి వెళ్తేనే ఇన్ఫెక్షన్ వస్తుంది. మెల్లిగా మాట్లాడితే కేవలం 100 నుంచి200 పార్టికర్టిల్స్ మాత్రమే వస్తాయి. సర్ఫేస్ ను ముట్టుకున్నా ఆ చేతులు కళ్లు, ముక్కు, నోటిని టచ్ చేస్తేనే మన శరీరంలోకి వైరస్ పోతుంది.

-ఏదైనా వస్తువు కొంటే వేడి నీళ్లలో కడిగితే వైరస్ చనిపోతుంది అంటున్నారు. అసలు వైరస్ ఎంత టెంపరేచర్‌ వద్ద చనిపోతుంది?

అది ఇంకా పూర్తిగా నిరూపణ కాలేదు. కొన్ని పరిశోధనల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర చనిపోతుందని అన్నారు.

-బయటకు వెళ్లి వచ్చిన వారు ఇంటికెళ్లాక బట్టల్ని సర్ఫ్ నీళ్లలో వేస్తే సరిపోతుందా? ఇంకా ఏవైనా డిస్ ఇన్ఫెక్టెంట్స్ వేయాలా?

అవసరం లేదు. కేవలం సర్ఫ్ నీళ్ల‌లో నానపెట్టినా సరిపోతుంది. బట్టలపై వైరస్ ఎక్కువ సేపు ఉండదు. వైరస్ బతకాలంటే కచ్చితంగా జీవకణం కావాల్సిందే. వైరస్ ముక్కు, కళ్లు, నోటి ద్వారా మాత్రమే పోతుంది. చేతులకు అంటితే తెలియకుండా ముక్కు, కళ్లూ, నోరును టచ్ చేస్తాం. కానీ, బట్టల ద్వారా సోకడం ఉండదు. అయితే… చేతులు మాత్రం శుభ్రం చేసుకోవాలి.

-శరీరంపై ఎక్కడైనా గాటు, గాయం ఉండి, అక్కడికి వైరస్ చేరితే శరీరంలోకి వెళ్లదా?

ప్రస్తుతానికైతే అటువంటిది కనిపించలేదు. ఇది రెస్పిరేటరీ వైరస్. ముక్కు, నోరు, కన్ను ద్వారా శ్వాసనాళంలోకి వెళ్లి, అక్క‌డి నుంచి రక్తనాళాల్లోకి పోతుంది. కాని డైరెక్ట్ గా రక్తనాళాల్లోకి పోయే పరిస్థితి లేదు.

-ఈ వైరస్ బయటపడ్డప్పుడు పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ కంట్రీస్ లోనే ఎక్కువ ప్రభావం చూపింది. మన దేశంలో ఇమ్యూనిటీ ఎక్కువ. కాబట్టి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు అన్నారు. కాని ఇప్పుడేమో ఇట్లా వైరస్ విజృంభిస్తోంది.

కేస్ అనేది ఇన్ఫెక్షన్ ద్వారా తెలుస్తుంది. మన దగ్గర వైరస్ సోకినా మృతుల సంఖ్య చాలా తక్కువ. మిలియన్ కు ఆ దేశాల్లో 200– 700 దాకా ఉంది. కాని మన దగ్గర 21 మంది మాత్రమే చనిపోతున్నారు. ఆ ఇమ్యూనిటీ ప్రభావం ఉన్నట్లే కదా. అంతేకాకుండా మన దగ్గర యువత ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్లు ఎక్కువ. ఇవన్నీ కారణాలు కావచ్చు. దక్షిణాసియా మొత్తం ఇదే పరిస్థితి.

-వైరస్ గమనం, రూపం ఏమైనా మారిందా? మొదట్లో స్లోగా ఉండేది. ఇప్పుడేమో విజృంభిస్తోంది.

అప్పుడు లాక్ డౌన్ వల్ల వైరస్ వ్యాపించడానికి తక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు జనం తిరుగుతున్నారు. అది వ్యాపించడానికి అవకాశం ఎక్కువైంది. దాని ప్రవర్తన కాదు, మన ప్రవర్తన కూడాముఖ్యమే కదా…

-ఈ వైరస్ మహమ్మారి నుంచి మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఏమి నేర్చుకోవాలి?

మొదటగా మన వ్యవస్థను మార్చాలి. మనం ఇంతవరకు ఆరోగ్య వ్యవస్థను చాలా నిర్ల‌క్ష్యం చేశాం. ప్రభుత్వం వైద్యం పై ఎంత ఖర్చు చేయాలో అంత చేయట్లేదు. 60 శాతానికి పైగా జనం తమ సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు. కేవలం 25 నుంచి 30 శాతం వరకే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రాథమిక, జిల్లా స్థాయిలో వైద్యసేవలు పెంచాలి. మెడికల్ కాలేజీల సేవల్ని బాగా వాడుకోవాలి. ప్రభుత్వం డబ్బు ఎక్కువ ఖర్చు చేసి వైద్య సిబ్బందిని, మెడికల్ ఎక్విప్ మెంట్ నుపెంచాలి.

మామూలు జీవితంలోకి ఎప్పుడు వెళ్లగలం?

మామూలు జీవితంలోకి ఎప్పుడు వెళ్తామనేది చెప్పడం కష్టం. వచ్చే ఏడాది మొదలు దాకా వేచి చూడాలి. చలికాలంలో ఈ వైరస్ ప్రభావం ఎట్లుంటుందో తెలియదు. వ్యాక్సిన్ వచ్చాక కూడా దాని ప్రబావం ఎంత మేరకు ఉంటుంది? ఎన్నాళ్లు అది మన శరీరంలో యాంటీ బయాటిక్స్ ను ఉంచుతుంది? అనేది తెలియదు.