కొన్ని సిటీల్లో ఇండ్లు అమ్ముడుపోవట్లే

కొన్ని సిటీల్లో ఇండ్లు అమ్ముడుపోవట్లే
  • హైదరాబాద్​లో 5 % పెరుగుదల

న్యూఢిల్లీ: కొన్ని నగరాల్లో అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర నగరం ఠాణేలో అత్యధికంగా 1.07 లక్షల యూనిట్లు అమ్ముడుపోని లిస్టులో ఉన్నాయి. చెన్నైలో మాత్రం 20 వేల యూనిట్లు మాత్రమే ‘అన్​సోల్డ్​’ కేటగిరీలో ఉన్నాయని డేటా అనలిటిక్ సంస్థ  ప్రాప్​ఈక్విటీ పేర్కొంది.   తొమ్మిది ప్రధాన నగరాల్లో అన్​సోల్డ్​హౌసింగ్​ యూనిట్ల సంఖ్య జూన్ క్వార్టర్​ చివరి నాటికి  5,26,914 యూనిట్ల నుంచి 5,15,169 యూనిట్లకు చేరుకుంది. 

అంటే రెండుశాతం తగ్గింది.  ఈ తొమ్మిది నగరాల్లో ఏప్రిల్-–జూన్‌‌‌‌లో ఇండ్ల విక్రయాలు 1,22,213 యూనిట్లు కాగా, కొత్త సరఫరా 1,10,468 యూనిట్లుగా ఉంది. దీంతో అమ్ముడుపోని రెసిడెన్షియల్ యూనిట్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది.  జూన్ క్వార్టర్​ చివరి నాటికి ఠాణేలో అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్‌‌‌‌లు 1,07,179 యూనిట్లు ఉండగా, మార్చి చివరి నాటికి 1,09,511 యూనిట్ల నుంచి 2 శాతం తగ్గాయి. ముంబైలో అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్స్ 3 శాతం పడిపోయి 62,735 యూనిట్ల నుంచి 60,911 యూనిట్లకు తగ్గిపోయాయి. అయితే, నవీ ముంబైలో అమ్ముడుపోని నిల్వలు 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ–-ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌లో అమ్ముడుపోని ఇన్వెంటరీలు గరిష్టంగా 26 శాతం తగ్గి 56,866 యూనిట్ల నుంచి 42,133 యూనిట్లకు పడిపోయాయి. 

పూణేలో అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్‌‌‌‌లు 9 శాతం పెరిగి 69,331 యూనిట్ల నుంచి 75,905 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో అమ్ముడుపోని యూనిట్లు 4 శాతం పెరిగి 49,986 యూనిట్ల నుంచి 52,208 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌‌‌‌లో అన్‌‌‌‌సోల్డ్ హౌసింగ్ స్టాక్స్ 5 శాతం పెరిగి 95,106 యూనిట్ల నుంచి 99,989 యూనిట్లకు చేరాయి. కోల్‌‌‌‌కతాలో అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్‌‌‌‌లు 20 శాతం వృద్ధితో 18,247 యూనిట్ల నుంచి 21,947 యూనిట్లకు చేరుకున్నాయి.