పేపర్ మారింది.. మెయిన్స్​ ప్రిపరేషన్​ మారాలి

పేపర్ మారింది.. మెయిన్స్​ ప్రిపరేషన్​ మారాలి

టీఎస్​పీఎస్సీ గ్రూప్​–1 ప్రిలిమ్స్​ ఫలితాలు వెల్లడయ్యాయి. 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మెయిన్స్​ పరీక్షల ప్రశ్నాపత్ర విధానాన్ని కమిషన్​ ప్రకటించింది. గ్రూప్​–1 మెయిన్స్​లో మొత్తం ఏడు పేపర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లీష్. ఇది పదో తరగతి స్థాయిలో ఉండే అర్హత పరీక్ష. మిగిలిన పేపర్లు ర్యాంకు నిర్ధారిస్తాయి. 

పేపర్​–1 జనరల్​ ఎస్సేలో ఆరు విభాగాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ప్రశ్నాపత్రంలో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో మూడు ప్రశ్నలుంటాయి. ప్రతి సెక్షన్​ నుంచి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు వెయ్యి  పదాల్లో సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు యాభై మార్కులు. మొత్తం 150 మార్కులు. సెక్షన్​–ఏలో సమకాలీన సామాజిక సవాళ్లు, సామాజిక సమస్యలు, ఆర్థిక వృద్ధి, న్యాయ వివాదాలు అంతర్భాగంగా ఉంటాయి. సెక్షన్​ – బిలో భారత రాజకీయ వివాదాలు, భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉంటాయి. సెక్షన్​–సిలో శాస్త్ర సాంకేతిక రంగాభివృద్ధి విద్యా– మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. 

పేపర్​–2లో అంతర్భాగంగా ఉన్న అంశాలు సెక్షన్​–ఏలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, సెక్షన్​ బిలో తెలంగాణ చరిత్ర చారిత్రక వారసత్వం, సెక్షన్–సిలో భారత్​, తెలంగాణ భూగోళశాస్త్రం ప్రశ్నాపత్రంలో కూడా మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్​కు యాభై మార్కులుంటాయి. ఒక్కో సెక్షన్​లో ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి.  ఒక్కో సమాధానానికి  పది మార్కులు. అయితే అభ్యర్థి గమనించాల్సినది ఏమిటంటే ప్రతి సెక్షన్​లోను ఉండే తొలి రెండు ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. చాయిస్​ ఉండదు. అంటే సెక్షన్​–ఏలో ఒకటి, రెండు ప్రశ్నలు, సెక్షన్​–బిలో ఆరు, ఏడు ప్రశ్నలు, సెక్షన్​–సిలో 11, 12 ప్రశ్నలు. వీటికి చాయిస్​ లేదు. మిగిలిన ప్రశ్నలకు ఇంటర్నల్​ చాయిస్​ ఉంటుంది. అంటే సెక్షన్​–ఏలో 3(ఏ) లేదా (బి), 4(ఏ) లేదా (బి), 5(ఏ) లేదా (బి), సెక్షన్​ – బిలో 8(ఏ) లేదా (బి), 9(ఏ) లేదా (బి), 10(ఏ) లేదా (బి), సెక్షన్​–సిలో 13(ఏ) లేదా (బి), 14 (ఏ) లేదా (బి), 15 (ఏ) లేదా (బి). ఒకటి, రెండు, ఆరు, ఏడు, పదకొండు, పన్నెండు ప్రశ్నలకు చాయిస్​ లేదు. కాగా 3, 4, 5, 8, 9, 10, 13, 14, 15 ప్రశ్నలకు ఇంటర్నల్​ చాయిస్​ ఉంది. పేపర్​–మూడు, నాలుగు, ఆరుకీ  ఇదే విధానం ఉంది. పేపర్​–5లో ఉన్న మూడు సెక్షన్లలో ఒకటి,  రెండు సెక్షన్లు ఇదే పద్ధతిలో ఉన్నాయి. మూడో సెక్షన్​లోని డేటా ఇంటర్​ప్రిటేషన్​, ప్రాబ్లమ్​ సాల్వింగ్​కు సంబంధించి క్వశ్చన్​ నెంబర్​ 11 నుంచి 40 వరకు ఉంటాయి. 30 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం యాభై మార్కులుంటాయి. 

జనరల్​ ఇంగ్లీష్​లో 15 ప్రశ్నలుంటాయి. ఇది అర్హత పేపర్​ మాత్రమే. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు. మొత్తం 150 మార్కులు. రీడింగ్ కాంప్రెహెన్షన్​, ప్రెస్సె రైటింగ్​, ఐడియా ఎక్స్​పాన్షన్​, లెటర్​ రైటింగ్, సెంటెన్స్​ రీ అరేంజ్​మెంట్​, సెంటెన్స్​ కరెక్షన్​, ఇడియమ్స్​, సినానిమ్స్​, ఆంటోనిమ్స్​, కరెక్షన్​ ఆఫ్​ స్పెల్లింగ్​, హామా నిమ్స్​, ప్రిపొజిషన్స్​, వాయిస్​ ఆఫ్​ స్పీచ్​, సబ్​ స్టిట్యూట్​ వర్క్స్​, పంక్చుయేషన్​ తదితర అంశాలు ఉంటాయి. 

దృష్టి పెట్టాల్సిన అంశాలు 

మెయిన్స్​ సిలబస్​కు సంబంధించిన సమకాలీన అంశాలపై ఫోకస్​ చేయాలి. ఉదాహరణకు పాలిటీలో సమాఖ్య అంశాలు మౌలికంగా చదువుతూ గవర్నర్​ వివాదాస్పద పాత్రను సమకాలీన అంశాలతో జోడించి చదవాలి. అంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో గవర్నర్​ పదవి ఎలా వివాదం అయిందో ఉదాహరణలతో తెలుసుకోవాలి. అలాగే జనరల్​ ఎస్సేలో మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ చారిత్రక వారసత్వం, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో క్రియాశీలత, పోలీస్​ సంస్కరణలు వంటి సంస్కరణలు,  మొదలైన అంశాలను చదవాలి.

సివిల్స్​ ​​ ఆప్షన్స్​ తరహా 

సివిల్స్​ ఆప్షనల్​లో రెండు సెక్షన్లుంటాయి. మొదటి సెక్షన్​లో ఒకటో ప్రశ్నలోని ఐదు ఉప ప్రశ్నలు, రెండో సెక్షన్లోని ఐదు ప్రశ్నులకు ఐదు ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. గ్రూప్​–1లో కూడా పేపర్​ రెండు, మూడు , నాలుగు, ఆరులో కూడా ఆరు ప్రశ్నలు చాయిస్​ లేని తప్పనిసరి ప్రశ్నలు. ఈ క్వశ్చన్​ పేపర్​ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు కింది అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్​ అవ్వాలి. 

1.    ప్రతి యూనిట్​లోని ప్రతి టాపిక్​ను వదలకుండా చదవాలి. 
2.     నిరంతరం రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. 
3.     ప్రిపరేషన్​కు అందుబాటులో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్,​ మే నెలలు అంటే 120 రోజులు. అన్ని రోజుల్లోనూ మూడు గంటలు రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. 
4.     రైటింగ్​ ప్రాక్టీస్​ చేస్తేనే ఎగ్జామ్​ హాల్​లో కదలకుండా మూడు గంటలు పరీక్ష రాయగలరు. 
5.     కనీసం 1500 నుంచి 1800 ప్రశ్నలకు ఆన్సర్​ రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. 
ఈ స్థాయి ప్రాక్టీస్​తో మాత్రమే ఒక్కో ప్రశ్నకు  పది నిమిషాల వ్యవధిలో ఆన్సర్​ రాయగలం. ఫైనల్​ సెలెక్షన్​ లిస్ట్​లో ఉండగలం. 

- పి. కృష్ణ ప్రదీప్​
21st సెంచరీ ఐఎఎస్​ అకాడమీ