చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల కొత్త కేసులు

చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల కొత్త కేసులు

కరోనా వైరస్ తో చైనా ప్రజలు వణికిపోతున్నారు. చైనా వ్యాప్తంగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన వారంలో ఒకే రోజు 37 లక్షల కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క రోజే 3.7 కోట్ల కొత్త కేసులు బయటపడ్డాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక లెక్కల్ని మాత్రం చైనా ప్రభుత్వం బయటపెట్టట్లేదు. ఇకనుంచి రోజువారి కరోనా కేసుల లెక్కల్ని బయటపెట్టబోమని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. బీజింగ్, జెజియాంగ్, ప్రావిన్స్ లాంటి ప్రధాన నగరాలతో పాటు దేశ జనాభాలో 60 శాతం మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు.

భారత్ పై చైనా ఎఫెక్ట్ పెద్దగా ఉండదని నిపుణులు చెప్తున్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత ప్రజల్లో సహజంగా ఇమ్యూనిటీ పెరిగిందని చెప్తున్నారు. అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.