ఆ చైనా యాప్ లను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని కేంద్రం చెప్ప లేదు

ఆ చైనా యాప్ లను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని కేంద్రం చెప్ప లేదు

గత కొద్ది రోజులుగా చైనాకు చెందిన 13యాప్ లను వెంటనే తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం టెక్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసినట్లు, డిలీట్ చేయకపోతే యూజర్ల వ్యక్తిగత వివరాలకు సెక్యూర్ గా ఉండవు అంటూ  ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో భారతీయులు తమ ఫోన్ల నుంచి చైనా యాప్ లను తొలగించారు.

ఇండియా టుడే కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో నేషనల్ ఇన్మర్మేటిక్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్ మెంట్ లు టెక్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు వైరల్ అవుతున్న లెటర్ హెడ్ పై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.

కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 13యాప్ లను డిలీట్ చేయాలని గూగుల్, యాపిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయలేదని, నెట్టింట్లో వైరల్ అవుతున్న లెటర్ హెడ్ కు కేంద్రానికి సంబంధం లేదని ట్వీట్ చేసింది. అంతేకాదు లెటర్ హెడ్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని సూచించింది.  చైనాకు చెందిన లైవ్ మీ, బీగో లైవ్, వీగో వీడియో, బ్యూటీ ప్లస్, క్యామ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ , షియాన్, రోమ్ వీ, యాప్ లాక్, వీమేట్, గేమ్ ఆఫ్ సుల్తాన్ యాప్ లను డిలీట్ చేయాలని కేంద్రం చెప్పలేదని, పీబీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ కు కేంద్రానికి సంబంధం లేదని కొట్టిపారేసింది.