మీకు అర్థం అవుతుందా.. ఏం అర్థం కావాలి.. ఏం తెలుసుకోవాలి అనే వెటకారాలు వద్దు.. భారతదేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రోజు వారీగా.. ఒక్క రోజుకు పెరుగుతున్న ధర అక్షరాల 12 రూపాయలు. అవును.. మీరు చదువుతున్నది అక్షర సత్యం. కావాలంటే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు చూస్తే అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే కింద ఉన్న డేటా చూడండీ..
- 2026, జనవరి ఒకటో తేదీన 111 రూపాయలు పెరిగింది
- 2026, ఫిబ్రవరి ఒకటో తేదీన 50 రూపాయలు పెరిగింది
- 2026, మార్చి ఒకటో తేదీన 31 రూపాయలు పెరిగింది
- 2026, మార్చి ఏడో తేదీన 115 రూపాయలు పెరిగింది
- 2026, ఏప్రిల్ ఒకటో తేదీన 218 రూపాయలు పెరిగింది
- 2026, మే ఒకటో తేదీన 993 రూపాయలు పెరిగింది
2026, జనవరి ఒకటో తేదీ నుంచి మే ఒకటో తేదీ వరకు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా 15 వందల 18 రూపాయలు పెరిగింది.
జనవరి ఒకటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ 120 రోజులు.. ఆరు సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచగా.. ఆ మొత్తం 15 వందల 18 రూపాయలు.
ఈ లెక్కన.. 120 రోజులకు.. 1518 రూపాయలు అంటే.. రోజుకు 12 రూపాయల 65 పైసలు అన్నమాట.
ఓవరాల్ లెక్కలను పరిగణలోకి తీసుకుని.. వాటిని రోజువారీగా మార్చినట్లయితే.. ఈ 120 రోజుల్లో.. ప్రతి రోజూ 12 రూపాయల 65 పైసల లెక్కన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెరిగింది..
ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇన్ఫలేషన్ మ్యాన్ మోడీ అంటూ ట్విట్ చేసింది. గత 4 నెలల్లో ప్రధాని మోదీ పెంచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అంటూ లిస్ట్ పెట్టింది.
మొదటి నాలుగు నెలల్లోనే ఎలా ఉందో చూపించారు.. ఈ ఏడాదిలో మిగిలిన 8 ఎనిమిది నెలలు మిగిలే ఉంది.. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు ట్విట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
'महंगाई मैन मोदी' का चाबुक फिर चला। आज कमर्शियल सिलेंडर 993 रुपए महंगा हुआ।
— Congress (@INCIndia) May 1, 2026
मोदी ने पिछले 4 महीने में कमर्शियल सिलेंडर के दाम ऐसे बढ़ाए 👇
• 1 मई: ₹993
• 1 अप्रैल: ₹218
• 7 मार्च: ₹115
• 1 मार्च: ₹31
• 1 फरवरी: ₹50
• 1 जनवरी: ₹111
--------------
टोटल: ₹1,518
जी…
