ఈ ఏడాది లాభాల్లోకి వస్తం : ప్రియాంకా సాలోట్

ఈ ఏడాది లాభాల్లోకి వస్తం : ప్రియాంకా సాలోట్
  • మరిన్ని స్టోర్లు తెరుస్తం
  • స్లీప్ కంపెనీ కో-ఫౌండర్ ​ప్రియాంక

హైదరాబాద్, వెలుగు : తమ కంపెనీ ఇది వరకే బ్రేక్​ఈవెన్​ సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి వస్తామని  పరుపులు, దిండ్లు, కుర్చీల వంటి ప్రొడక్టులు అమ్మే స్లీప్ కంపెనీ కో–ఫౌండర్​ప్రియాంకా సాలోట్​ అన్నారు.  తన 75వ స్టోర్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని హిమాయత్ నగర్‌‌‌‌లో  ప్రారంభించిన సందర్భంగా ఆమె ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ.320 కోట్ల రెవెన్యూ సాధించాం. ఈసారి రూ.వెయ్యి కోట్లు వస్తాయని అనుకుంటున్నాం. ప్రస్తుతం 24 సిటీల్లో 75 స్టోర్లు ఉన్నాయి. మరో  ఏడాదిలో వీటిని రెట్టింపు చేస్తాం.

హైదరాబాద్​లో మరో ఎనిమిది స్టోర్లు తెరుస్తాం.  విస్తరణ కోసం ఇది వరకే మూడు రౌండ్ల ద్వారా కోట్లాది రూపాయల నిధులు సేకరించాం. మా పెట్టుబడుదారుల్లో అజీమ్​ ప్రేమ్​జీ కూడా ఒకరు. స్లీప్​టెక్​ ఇండియాలోని స్లీపింగ్​ సొల్యూషన్స్​టాప్​–5 బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. మాకు ముంబై, బెంగళూరులో ప్లాంట్లు ఉన్నాయి. 150 ప్రొడక్టులు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పేటెంట్లూ ఉన్నాయి. విదేశాల్లోనూ ప్రొడక్టులు అమ్మబోతున్నాం” అని వివరించారు