దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు మరింత వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న (మంగళవారం) 3.27 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 3,205 మందిలో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో 1,414 మంది వైరస్ బారినపడగా.. ముందురోజు కంటే కేసులు 32 శాతం అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.97 శాతానికి చేరింది. 

గత 24 గంటల వ్యవధిలో 2,802 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం 19,509 కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ తో 31 మంది చనిపోయారు. నిన్న సెలవు రోజు కావడంతో పరీక్షల సంఖ్య, టీకా పంపిణీ నిలిచిపోయింది. తాజాగా 4,79,208 మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం..

గ్రూప్​ వన్​ ఎగ్జామ్​ ఉర్దూలో ఎట్ల పెడతరు?

పలు జిల్లాల్లో కుండపోత వర్షం