Tourist Family: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దెబ్బకు దిగ్గజాలు ఢమాల్.. బడ్జెట్ రూ. 7 కోట్లు.. వసూళ్లు రూ. 90 కోట్లు!

Tourist Family: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దెబ్బకు దిగ్గజాలు ఢమాల్.. బడ్జెట్ రూ. 7 కోట్లు.. వసూళ్లు రూ. 90 కోట్లు!

ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే బలమైన కథ,  స్కీన్ ప్లే,  దర్శకుడి విజన్ ఉంటే చాలు పెద్ద తారగణం లేకపోయినా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేయొచ్చు. సినీ ప్రియులకు నచ్చితే చిన్న చిత్రమైన కలెక్షన్ల వర్షం కురిపించేస్తారు. 2025 తొలి అర్ధభాగం సినీ బాక్సాఫీస్ లెక్కలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.  బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన 'ఛావా' ( Chhava ) ,  'L2; ఎంపురాన్' (  L2 Empuraan)వంటి దిగ్గజ చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించి కోట్లు కొల్లగొట్టినా, సింహాసనాన్ని దక్కించుకుంది మాత్రం ఓ దక్షిణాది చిన్న సినిమా. ఇది కేవలం రూ. 7 కోట్ల చిరు బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 90 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వసూలు రాబట్టి సినీ లోకాన్నే ఆశ్చర్యపరిచింది తమిళ చిత్రం. ఇది డబ్బు కాదు ..  ఒక మ్యాజిక్ నిరూపించింది..
  
' టూరిస్ట్ ఫ్యామిలీ ' మ్యాజిక్..
ఇంతకి ఈ సినిమా మరేదో కాదు. అభిషన్ జీవింత్ ( Abishekan Jeevinth ) దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ' టూరిస్ట్ ఫ్యామిలీ ' ( Tourist Family ) .   ఈ చిత్రం 2025లో ఇప్పటివరకు అత్యంత లాభాదాయకమైన భారీతీయ చిత్రంగా నిలచి ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.  కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే పెట్టిన బడ్జెట్ పై ఏకంగా 1200 శాతం లాభాన్ని ఆర్జించింది.  ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు.. భారతీయ సినీ పరిశ్రమలో కథే అసలైన కింగ్ అని నిరూపించింది. 

ALSO READ : Coolie: 'కూలీ'కి రూ. 50 కోట్లు.. నా కష్టానికి తగిన పారితోషికం దక్కిందన్న లోకేష్ కనగరాజ్ !

స్టార్ పవర్ సున్నా, కథే హీరో .. 
ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న విడుదలైన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. ఎం. శశి కుమార్ (   M Sasikumar ) , సిమ్రాన్ ( Simran ) , మిథున్ జై శంకర్  ( Mithun Jai Shankar ), కమలేష్ జగన్ ( Kamalesh Jagan ) వంటి తారలు నటించారు. వీరు కూడా ప్రేక్షకులకు అంతగా సుపరిచితులు కారు.  స్టార్ పవర్ అన్నది ఈ మూవీలో అసలు లేనే లేదు. కానీ కేవలం బలమైన కథ , హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు, సహజమైన నటనతో వచ్చిన ఈ సినిమా సగటు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసింది.  విర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్ అనే ఆయుధంతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

తొలుత ఈ చిన్న  బడ్జెట్ చిత్రం.. పెద్ద స్టార్స్ మూవీస్ కింద బొల్తా పడుతుందిలే అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి వారంలోనే రూ. 23 కోట్లు, రెండో వారంలో రూ. 29 కోట్లు వసూలు చేసి విస్మయపరిచింది. ఐదు వారాల థియేట్రికల్ రన్ ముగిసేసరికి, దేశీయంగా రూ. 62 కోట్లు, అంతర్జాతీయంగా రూ. 28 కోట్లు వసూలు చేసి, ట్రేడ్ పండితులను కూడా నివ్వెరపరిచింది. సినిమాకు స్టార్స్ కాదు, స్క్రిప్ట్, స్టోరీనే అసలైన హీరోలని 'టూరిస్ట్ ఫ్యామిలీ' మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రం థియేటర్లలోనే కాదు OTTలోనూ దూసుకుపోతుంది.

 

లాభాల లెక్కల్లో వెనకబడ్డ భారీ బడ్జెట్ చిత్రాలు
మరోవైపు, భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు వసూళ్ల పరంగా కోట్లు కొల్లగొట్టినా, లాభాల విషయంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' దరిదాపుల్లో కూడా లేవు. విక్కీ కౌశల్ 'ఛావా' ప్రపంచవ్యాప్తంగా రూ. 808 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక గ్రాసింగ్ చిత్రం అయింది. రూ. 90 కోట్ల బడ్జెట్‌తో 800% లాభం సాధించినా, 'టూరిస్ట్ ఫ్యామిలీ' 1200% లాభం ముందు ఇది చాలా తక్కువ.  ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ( Sitare Zameen Par )  రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూ. 260 కోట్లు వసూలు చేసి, 300% లాభదాయకతతో మంచి రాబడిని చూపింది. మలయాళ చిత్రం 'తుదరుమ్' ( Tudarum )  720% లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. తమిళ ఫాంటసీ-యాక్షన్ చిత్రం 'డ్రాగన్' (  Dragon ) , మన తెలుగు బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ( Sankranthiki Vasthunnam ) కూడా సుమారు 300% లాభాలను సాధించి సత్తా చాటాయి.  కానీ, 'టూరిస్ట్ ఫ్యామిలీ' లాంటి సంచలనం ఎవరూ సృష్టించలేకపోయారు.

ఈ లెక్కలు ఒక విషయాన్ని పరిశీలిస్తే భారతీయ సినిమాకు ప్రాంతం అడ్డుకాదు. తక్కువ బడ్జెట్‌తో కూడా అద్భుతమైన కథలతో అంచనాలను మించిపోవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి. 'టూరిస్ట్ ఫ్యామిలీ' విజయం భారతీయ సినీ పరిశ్రమలో ఒక మైలురాయి. కథే అసలైన శక్తి అని, కంటెంట్‌కు పట్టం కడితే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించవచ్చని ఈ సినిమా నిరూపించింది.