అమెరికా ఫైటర్​ జెట్​కు ఆరు మీటర్ల దూరంలో చైనా జెట్​..

అమెరికా ఫైటర్​ జెట్​కు ఆరు మీటర్ల దూరంలో చైనా జెట్​..

అసలే అమెరికా, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది.. దక్షిణ చైనా సముద్రంలో పట్టుకోసం రెండు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పైగా అక్కడి ఇంటర్నేషన్ ఎయిర్ స్పేస్‌లో అమెరికా డ్రిల్స్ చేస్తున్నది.. ఇట్లాంటి టైమ్‌లో అమెరికా ఫైటర్‌‌ జెట్‌కు సమీపం నుంచి చైనా ఫైటర్ జెట్ దూసుకెళ్లింది. తమ జెట్‌కు కేవలం 6 మీటర్ల దూరంలో నుంచి చైనా ఫైటర్ జెట్‌ వెళ్లిందని, తమ పైలెట్ అప్రమత్తంగా లేకపోయుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అమెరికా ఆర్మీ చెప్పుకొచ్చింది. ఈ నెల 21న ఈ ఘటన జరిగిందని, రెండు విమానాలు ఢీకొనకుండా తమ పైలెట్ తప్పించాడని చెప్పింది.