నక్సల్​ను చంపేసిన గ్రామస్థులు

నక్సల్​ను చంపేసిన గ్రామస్థులు

రోడ్డు వేస్తుంటే అడ్డుకున్నందుకు నక్సల్​ను చంపేశారు
రిపబ్లిక్​ డేను బ్లాక్​ డేగా పాటించాలనడంపై గ్రామస్థుల ఆగ్రహం
ఆగ్రహంతో కాల్పులు  జరిపిన మావోయిస్టులు
ప్రతిగా బాణాలు, రాళ్లతో స్థానికుల దాడి
ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో ఘటన

మల్కన్గిరిఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో జంతురై​ గ్రామస్తులు మావోయిస్టులపై తిరగబడ్డారు. బాణాలు, రాళ్లతో దాడిచేశారు. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులపై గ్రామస్తులు తిరగబడటం ఇదే తొలిసారని, ఆ ఊరివాళ్లకు రక్షణ కల్పించామని పోలీసులు ప్రకటించారు. జంతురై గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డును ఇటీవల మావోయిస్టులు అడ్డుకున్నారు. ఈ గ్రామానికి మూడువైపులా బలిమెల రిజర్వాయర్​ నీళ్లు, మరోవైపు దట్టమైన అడవి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు వేస్తుంటే ఆపేయడంపై స్థానికులు కోపంగా ఉన్నట్టు చెప్తున్నారు.

రిపబ్లిక్​డే వద్దంటూ..

ఇద్దరు మావోయిస్టులు శనివారం రాత్రి జంతురై​గ్రామంలోకి వచ్చారు. రిపబ్లిక్​ డేను బ్లాక్​డేగా పాటించాలంటూ స్థానికులను హెచ్చరించారు. అందుకు వారు ఒప్పుకోలేదు. మావోయిస్టుల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదని మండిపడ్డారు. దీనిపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. మావోయిస్టులను వెంటపడి తరిమారు. మావోయిస్టులు కాల్పులు మొదలుపెట్టడంతో.. గ్రామస్తులు బాణాలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఓ మావోయిస్టు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు దీనిపై సమీపంలోని బీఎస్ఎఫ్​ క్యాంపుకు సమాచారం ఇచ్చారు. జవాన్లు అక్కడికి చేరుకుని గాయపడ్డ మావోయిస్టును హాస్పిటల్​కు తరలించారు. మరో మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. మావోయిస్టులు ప్రతికార దాడికి పాల్పడవచ్చని జంతురై గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?