
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఐదుగురు స్టార్ క్యాంపెయినర్లకే పర్మిషన్ ఉందని స్టేట్ ఎలక్షన్ కమిషన్బుధవారం ప్రకటించింది. రిజిస్టర్డ్ పార్టీల నుంచి ఇద్దరికి చాన్స్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రికగ్నైజ్డ్ పార్టీల నుంచి పది మందికి స్టార్ క్యాంపెనర్లుగా అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో వారి సంఖ్యను సగానికి కుదించారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్ల జాబితాతోపాటు నిర్దేశిత ఫార్మాట్‌లో వారి వివరాలను మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించారు. స్టార్ క్యాంపెయినర్లకు మాత్రమే జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.