Best Selling Hatch backs:ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడయిన కార్లు ఇవే..

Best Selling Hatch backs:ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడయిన కార్లు ఇవే..

ఫిబ్రవరి 2024లో కాంపాక్ట్, మధ్యతరహా హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయంలో గతం మాదిరిగానే ఈ సారి కూడా మారుతి కార్లదే హవా కొనసాగుతోంది. కార్ల అమ్మకాలలో మారుతి కంపెనీదే అగ్రస్థానం.  టాప్ 6 మోడల్స్ లో 4 మారుతికి చెందినవే. మారుతీతో పాటు టాటా కారు కూడా టాప్ 3 లో చోటు దక్కించుకుంది. 

ఫిబ్రవరి 2024లో అత్యధికంగా అమ్ముడయిన కార్లు 

మారుతి వ్యాగన్ ఆర్ 

ఫిబ్రవరి 2024 లో భారత దేశంలో అత్యధికంగా అమ్ముడయిన  హ్యాచ్ బ్యాక్. ఫిబ్రవరిలో  ఈ హ్యాచ్ బ్యాక్ 19,417 యూనిట్లు అమ్ముడయ్యాయి. సంవత్సరానికి 15 శాతం, నెలవారీ అయితే 9 శాతం వృద్దిని సాధించాయి. 

మారుతి స్విఫ్ట్ 

ఫిబ్రవరి 2024లో మారుతి స్విఫ్ట్ కారు మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాంచింది. రెండో అత్యధకంగా అమ్ముడైన హ్యాచ్ బ్యాక్ గా నిలిచింది. ఫిబ్రవరిలో 13,162 కార్లు అమ్ముడయ్యాయి. దీని  MoM 14 శాతం కాగా.. YOY 28 శాతం తగ్గాయి. 

టాటా టియాగో 

ఫిబ్రవరిలో 6,947 కార్లను టాటా టియాగో విక్రయించి అమ్మకాల్లో మూడో స్థానంలో ఉంది. టియాగో నెలవారి అమ్మకాలు 7 శాతం పెరిగాయి.గత ఫిబ్రవరి 2023 కంటే దాదాపు 500 యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి. 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 100 నియోస్ 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 100 నియోస్  ఫిబ్రవరి నెల అమ్మకాలు 4,947. ఫిబ్రవరి 2024లో కార్ల అమ్మకాల్లో హ్యుందాయ్ నాలుగో స్థానంలో ఉంది. గతేడాది 2023 అమ్మకాలతో పోలిస్తే 2000యూనిట్లు తగ్గాయి. హ్యాందాయ్ వార్షిక విక్రయాలుకూడా 49 శాతం క్షీణించాయి.

మారుతి సుజుకీ సెలెరియో 

ఈ హ్యాచ్ బ్యాక్ కారు మొత్తం 3586 యూనిట్లను విక్రయించి కార్ల అమ్మకాల్లో ఐదో స్థానంలోఉంది. మంత్లీ అమ్మకాలు 19 శాతం, వార్షిక అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. 

మారుతి సుజుకి ఇగ్నిస్ 

ఫిబ్రవరి 2024లో మారుతి సుజుకీ ఇగ్నిస్  మొత్తం 2100 కార్లను విక్రయించి జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఇగ్నిస్ MoM అమ్మకాలు 500 యూనిట్లు తగ్గాయి. వార్షిక అమ్మకాలు 56 శాతం క్షీణించాయి.