హైవేపై దొంగల బీభత్సం

హైవేపై దొంగల బీభత్సం
  • బెంబేలెత్తుతున్న వాహనదారులు, ప్రయాణీకులు

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట హైవేపై దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి మండలంలోని పెద్దనాగరం శివారు వద్ద నిజామాబాద్ నుంచి నూజివీడు వెళ్తున్న లారీ డ్రైవర్ గుండెబోయిన ఉమశంకర్ ను ఆపి, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అతడిపై దాడి చేసి బలవంతంగా డబ్బులు లాక్కెళ్లారు. దీంతో ఆయన పెద్దనాగరం గ్రామస్తులతో జరిగిన విషయం చెప్పారు. గతంలోనూ ఇలాగే జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావుడ్య నరేశ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

40 ఏండ్ల తర్వాత ఓల్డ్ సిటీ రోడ్ల విస్తరణ