
కరోనా వైరస్ దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెరుగుతోంది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. ఇటీవల మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కొవిడ్19 కేసుల విస్తరణలో దీన్ని థర్డ్ వేవ్‌గా చెప్పవచ్చని ఆయన చెప్పారు. కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని కేజ్రీవాల్ తెలిపారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. గతంలో లా కొత్త కేసులు పెరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.