ఈ ప్లాస్టిక్​ కంటెయినర్​ బాటిల్ ​ ట్రావెలింగ్​ ఫ్రెండ్లీ

ఈ ప్లాస్టిక్​ కంటెయినర్​ బాటిల్ ​ ట్రావెలింగ్​ ఫ్రెండ్లీ

సమ్మర్​లో చాలామంది టూర్​లకు వెళ్తుంటారు. ఇలా ట్రావెల్​ చేసేటప్పుడు షాంపూ, మాయిశ్చరైజర్​, సన్​స్క్రీన్​ వంటి లోషన్స్​ తీసుకెళ్లడం రిస్క్​ అనిపిస్తుంది. ఎందుకంటే వాటిని పెట్టడానికి బ్యాగ్​ లేదా సూట్​కేసులో చాలా ఎక్కువ స్పేస్​ కావాలి. అదీకాక  కొన్నిసార్లు అవి లీక్​ అయ్యి బట్టలు, సామాన్లు పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా చేసేందుకే ఈ స్టోరేజి ప్లాస్టిక్ కంటెయినర్​ బాటిల్స్​. వీటిలో షాంపూ, బాత్​ క్రీం, మాయిశ్చరైజర్​ లోషన్​లను నింపుకుని తీసుకెళ్తే వెయిట్, ప్లేస్, లీకేజి సమస్యలేవీ ఉండవు. ఇవి సిలిండర్​ షేప్​లో ఉండడం వల్ల ఎక్కువ స్పేస్​ పట్టదు. స్క్రూ మోడల్​లో, ఫ్లిప్​–లిడ్​ క్యాప్​ ఉంటుంది. అందుకని మౌత్​వాష్​ లాంటి పలుచటి లిక్విడ్స్​ వీటిలో నింపినా బయటకు కారిపోతాయన్న భయం ఉండదు. అలాగే రీఫిల్లింగ్​ చేసుకునేందుకు వీటి మూతి వెడల్పుగా ఉంటుంది. వీటిని క్లీన్​ చేయడం కూడా ఈజీ, బాటిల్​ వంపగానే క్రీమ్ లేదా లోషన్​​ ఎక్కువ మొత్తంలో చేతిలో పడదు. ఏ బాటిల్​లో ఏం నింపామా అని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బాటిల్స్​ మీద షాంపూ, స్కిన్​కేర్, బాత్​ క్రీం అని రాసి ఉంటుంది. వీటి సైజ్​ సెంటిమీటర్లలో... 5.5 పొడవు, 5.5 వెడల్పు, 13 ఎత్తు ఉంటుంది. ఒక్కో బాటిల్​ కెపాసిటీ 45 ఎంఎల్​. ఈ బాటిల్స్​ రంగు స్కై బ్లూ, వైట్​ రంగుల్లో ఉంటుంది​. ఈ ప్యాకేజిలో ఒక ట్రావెల్​ షాంపూ బాటిల్​ కూడా ఉంటుంది. బరువు 54 గ్రాములు. ఇనోవెరా లేబుల్​ పేరు మీద దొరుకుతున్న ఈ ప్లాస్టిక్​ కంటెయినర్​ బాటిల్ ​ ట్రావెలింగ్​ ఫ్రెండ్లీ.

ధర:239 రూపాయలు