నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్ డ్ టాక్ రాగా, తర్వాత నుంచి మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో అన్నీ కొత్తగానే జరిగాయి.
ఫిలిం మేకింగ్, లొకేషన్స్‌లో సిచువేషన్, ట్రైలర్ లేకపోవడం, రిలీజ్ ముందు ఉండే సిచువేషన్.. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన ఉదయం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌గా మారిపోతుంది.
‘ప్యారడైజ్’కి రివర్స్‌లో జరిగింది. రిలీజ్ రోజున ప్రీమియర్స్‌కి ఒకలాగ మొదలైంది. ఆ తర్వాత ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెస్పాన్స్‌ని నేను చూడలేదు’ అని అన్నాడు.
మోహన్ బాబు మాట్లాడుతూ ‘నాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ‘ప్యారడైజ్’ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. ఆయన దేశంలోనే ఒక టాప్ డైరెక్టర్ అవుతారు’ అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీమ్ అంతా ఈ స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
