యోగా చేసేవారికి కరోనా వచ్చే చాన్స్‌ చాలా తక్కువ

యోగా చేసేవారికి కరోనా వచ్చే చాన్స్‌ చాలా తక్కువ
  • ఆయుష్‌ మినిస్టర్‌‌ శ్రీపాద్‌ నాయక్‌

 

న్యూఢిల్లీ: ప్రతి రోజు యోగా చేసేవారికి కరోనా వచ్చే ఛాన్సెస్‌ చాలా తక్కువ అని ఆయుష్‌ మినిస్టర్‌‌ శ్రీపాద నాయక్‌ అన్నారు. ఆదివారం యోగాడే పురస్కరించుకుని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. “ మోడీ నేతృత్వంల ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని, అది కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడిందని నేను కచ్చితంగా చెప్పగలను. యోగా చేసే వాళ్లు కరోనా బారిన పడటటం చాలా తక్కవు” అని మంత్రి చెప్పారు. యోగా ఇమ్యూనిటీని పెంచుతుందని, శ్వాస వ్యవస్థకు బలం చేకూరుస్తుందని అన్నారు. రెసిస్‌టెన్స్‌ పవర్‌‌కూడా పెరుగుతుందని చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది లడాఖ్‌లో నిర్వహించాల్సిన యోగా కార్యక్రమం క్యాన్సిల్‌ అయిందని అన్నారు. నార్త్‌ గోవా జిల్లాల్లోని పనాజీ దగ్గర్లో రిబందర్‌‌ గ్రామంలోని తన ఇంట్లోనే మంత్రి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ కూడా తన ఇంటి నుంచే యోగా డే లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎవరి ఇంట్లో వారే యోగా చేసుకునే విధంగా ‘ యోగా ఎట్‌ హోమ్‌, యోగా విత్‌ ఫ్యామిలీ’ నినాదంతో యోగా డే నిర్వహించిన కేంద్రం.