లిథువేనియా: చల్లటి వాతావరణంలో కొన్ని నిమిషాలు ఉండాలంటేనే ప్రాణం పోయినంత పనైతది. అలాంటిది దాదాపు మూడున్నర గంటలు ఐస్‌లో కూర్చుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు వాలెర్జన్ రొమనోస్కి. లిథువేనియా విల్నోలోని రోడ్డుపై జరిగిన ఈ ఈవెంట్‌లో ఐస్ నింపిన గ్లాస్ బాక్స్‌లో 3 గంటల 28 నిమిషాలు ఉన్నాడు. 2 గంటల 35 నిమిషాల 35 సెకండ్లు ఐస్‌లో నిల్చుని రొమైన్ వాన్‌డెన్‌డార్పె క్రియేట్ చేసిన రికార్డును వాలెర్జన్ బ్రేక్ చేశాడు. అయితే గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకోవడం వాలెర్జన్‌కు ఇదే ఫస్ట్ టైం కాదు. 12 గంటల్లో 314.65 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇప్పటికే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
