కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది

కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది

పుట్టినరోజును అందరూ జరుపుకోవాలనుకుంటారు. పిల్లలైతే మరీనూ.. స్నేహితులను, చుట్టాలను పిలిచి అందరి ముందు కేక్ కట్ చేయాలని ఆశపడుతుంటారు. అలాగే బర్త్ డే చేసుకుంటున్న ఒక బాలుడికి బర్త్‌డేనే డెత్ డే అయింది. గన్‌తో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ పేలి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటన హూస్టన్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని పోర్టర్‌లో జరిగింది. బాలుడు తన కుటుంబం మరియు ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాడు. అయితే బర్త్ డేకు వచ్చినవారిలో ఎవరో తమ తుపాకీను పడేసుకున్నారు. ఆ తుపాకీ బర్త్ డే బాయ్‌కి దొరికింది. పార్టీకి వచ్చినవాళ్లంతా ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే తేరుకొని వెళ్లి చూసేసరికి బర్త్ డే బాయ్ శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయి కిందపడి ఉన్నాడు. వెంటనే వారందరూ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. కేసు నమోదు చేసిన మోంట్గోమేరీ కౌంటీ షెరీఫ్ విభాగం దర్యాప్తు చేస్తోంది.

ఇలా ప్రమాదవశాత్తు ఈ ఏడాది కనీసం 229 గన్ ఫైరింగ్‌లు జరిగాయని.. ఆ ప్రమాదాల్లో 97 మంది మరణించినట్లు ‘గ్రూప్ ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ’ కార్యాలయం తెలిపింది. అమెరికాలో నాలుగింట మూడొంతుల మంది తుపాకీని కలిగి ఉన్నారు. యూఎస్ రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా అడల్ట్స్ ఎవరైనా గన్ లైసెన్స్ పొందే హక్కు ఉంది. తుపాకీల వాడకం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో టెక్సాస్‌ ఒకటి.

For More News..

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ

వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్