బీఆర్ఎస్ పాలనలో అవినీతి, విధ్వంసం ఎక్కువైనయ్ : తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్  పాలనలో అవినీతి, విధ్వంసం ఎక్కువైనయ్ : తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్  పాలనలో అవినీతి, విధ్వంసం, అరాచకం ఎక్కువైయ్యాయని అన్నారు మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.  పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల బూత్ కమిటీ సమావేశంలో తుమ్మల, పొంగులేటి పాల్గొన్నారు.  తామిద్దరం బీఆర్ఎస్ బలపేతం కోసం పనిచేశామని, కానీ కేసీఆర్ మమల్ని దూరం పెట్టి నాశనం చేసుకున్నారని చెప్పారు తుమ్మల .  ః

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పిన తుమ్మల..  రాష్ట్ర కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలన్నారు.  భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను,  పొంగులేటి  కాంగ్రెస్ లో చేరామన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి,  కీర్తి ప్రతిష్టలు పెంచేలా  తామిద్దరం  కష్టపడుతామని తెలిపారు.  సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలియడంతో బీఆర్ఎస్  లో కలవరం మొదలైందని విమర్శించారు.