టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్

టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్

టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్  మొట్టమొదటి సారిగా స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ‘స్మార్టిసన్ జియాంగ్వో  ప్రో 3’ (నట్ ప్రో3) పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ లో మూడు వేరియంట్లున్నాయని కంపెనీ తెలిపింది. బేసిక్ వేరియంట్ లో 8 GB ర్యామ్, 128GB స్టోరేజీని కలిగివుంది. దీని ధర సుమారుగా రూ.29 వేల వరకు ఉంటుందని చెప్పింది. 8GB ర్యామ్ 256 GB ఉన్న పోన్ ధర రూ.32 వేలుగా ఉండనుంది. హై ఎండ్ ఫోన్ లో 12GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగివుందని.. దీని ధర రూ.36 వేల వరకు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

నట్ ప్రో 3 ఫీచర్స్...

…6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే

… వెనుక భాగంలో 48 MP సామర్థ్యమున్న ప్రధాన కెమెరా,13MP వైడ్ యాంగిల్ కెమెరా

…2 X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫొటో లెన్స్, 5MP మాక్రో కెమెరా

…ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20MP

…బ్యాటరీ 4000 MAH ను కలిగివుంది

…స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్