అప్పుడు కోట్లు సంపాదించిన టిక్‌‌టాక్‌ స్టార్లు.. మరి ఇప్పుడు?

అప్పుడు కోట్లు సంపాదించిన టిక్‌‌టాక్‌ స్టార్లు.. మరి ఇప్పుడు?

‘టిక్‌టాక్‌లో ఎడ్యు టాక్‌ అనే సెక్షన్‌ ఉంటుంది. క్రియేటర్లు ఎడ్యుకేషనల్‌‌ కంటెంట్‌కు ఎంటర్‌‌‌‌టైన్‌మెంట్‌‌ను జోడిస్తూ తమ వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. నేను మెంటల్‌‌ హెల్త్‌‌పై కంటెంట్‌‌ను క్రియేట్‌ చేసేవాడిని. చాలా మంది ఇంగ్లిష్‌, లైఫ్‌ హ్యాక్స్‌‌, స్కిన్‌కేర్‌‌‌‌ వంటి అంశాలపై తమకంటెంట్‌ వీడియోలను పోస్ట్‌ చేసేవారు. కొత్త ప్లాట్‌ఫామ్‌లలో టిక్‌టాక్‌లో వచ్చిన స్థాయిలో వ్యూస్‌‌ రావడం లేదు’ గౌరవ్ జైన్‌‌.

న్యూఢిల్లీ: టిక్‌‌టాక్‌ ‌బ్యాన్‌ ‌తర్వాత కొత్త ప్లాట్‌‌ఫామ్‌‌లకు షిఫ్ట్‌ అయిన టిక్‌‌టాక్ ఇన్‌‌ఫ్లూయన్సర్లకు(టిక్‌ టాక్‌ స్టార్లు) ఆశించినంతగా ఇన్‌‌కమ్‌‌ రావడం లేదు. టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌ను క్యాష్‌‌ చేసుకోవాలని వచ్చిన చింగారి, రొపొస్సో, ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌రీల్స్ వంటి షార్ట్‌ వీడియో కంటెంట్‌ ‌యాప్‌లలో టిక్‌‌టాక్‌‌లో మాదిరి ఫాలోవర్లను సంపాదించడం వీరికి కష్టంగా మారింది. అంతేకాకుండా బ్రాండ్‌ ‌అడ్వర్టైజర్లు కూడా యాడ్స్‌ ఇవ్వడానికి డబ్బు ఖర్చు చేయడం తగ్గించేస్తున్నాయి. సోషల్‌ మీడియా యాప్‌‌లలో అందంగా కనిపించడం చాలా ముఖ్యమని అంటున్నారు ఇన్‌‌ఫ్లూయన్సర్లు. కానీ మిగిలిన యాప్స్‌తో పోల్చుకుంటే టిక్‌‌టాక్‌‌లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరని చెబుతున్నారు. ఈ ప్లాట్‌‌ఫామ్‌‌లో నువ్వొక ఇన్‌‌ఫ్లూయన్సర్‌‌గా కనిపించకపోయిన సక్సెస్‌ ‌అవ్వొచ్చని అంటున్నారు. టిక్‌‌టాక్‌‌లో 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన గౌరవ్‌‌జైన్‌‌కు మిగిలిన సోషల్‌ మీడియా యాప్‌‌లలో ఇదే స్థాయిలో ఫాలోవర్లు లేరు. తను పోస్ట్‌ చేసే వీడియోలకు వ్యూవర్‌‌షిప్‌ కూడా తగ్గుతోందని చెప్పారు.

మరో టిక్‌‌టాక్‌ ‌ఇన్‌‌ఫ్ల్యూయన్సర్‌ గీత్‌(1.1కోట్ల మందిఫాలోవర్లు) టిక్‌‌టాక్‌ ‌బ్యాన్‌‌తో ఇన్‌‌స్టాగ్రామ్‌‌రీల్స్‌కు మారారు. కానీ టిక్‌‌టాక్‌‌లో వచ్చినంత పేరు ఈ ప్లాట్‌‌ఫామ్‌‌లో రావడం లేదని వాపోతున్నారు. మోటివేషనల్‌‌, ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌‌ను గీత్ క్రియేట్‌‌ చేసేవారు. పెద్దసంఖ్యలో టీనేజర్లతో కనెక్ట్‌ అవ్వడానికి టిక్‌‌టాక్‌‌ ఉపయోగపడేదని ఆమె చెబుతున్నారు. టిక్‌ ‌టాక్‌‌లో బాగా యాక్టివ్‌‌ గా ఉన్న క్రియేటర్లకు కూడా ఇతర ప్లాట్‌‌ఫామ్‌‌లలో ఫాలోవర్లు టిక్‌‌టాక్‌‌లో వచ్చిన స్థాయిలో రావడం లేదు. టిక్‌‌టాక్‌‌లో 4.33 కోట్ల ఫాలోవర్లను సంపాదించిన రియాజ్‌ ‌అలీకి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో కేవలం 84 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. రెవెన్యూల పరంగా చూస్తే టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌తో టాప్‌ 100 మంది ఇన్‌‌ఫ్లూయన్సర్లకు రూ. 120 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఇండియన్‌ ‌ఇనిస్టిట్యూట్‌‌
ఆఫ్‌ హ్యూమన్‌ ‌బ్రాండ్స్‌(ఐఐహెచ్‌‌బీ) అంచనా వేసింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌‌ఫ్లూయన్సర్లు నెలకు రూ. 35 వేల వరకు ఈజీగా సంపాదించుకునే వారని పేర్కొంది. రియాజ్‌‌అలీ వంటి వారు ఏడాదికి రూ.5–6 కోట్లను టిక్‌‌టాక్ నుంచి పొందేవారని చెప్పింది. టిక్‌‌టాక్‌‌లో సంపాదించినట్టే ఇతర కొత్తయాప్‌‌లలో సంపాదించడానికి ఇన్‌‌ఫ్లూయన్సర్లకు టైమ్‌ ‌పడుతుందని పేర్కొంది. టిక్‌‌టాక్‌ ‌కూడా స్టార్ట్‌ అయి ఐదేళ్లు అవుతున్నా గత ఏడాదిన్నర నుంచే ఇన్‌‌ఫ్లూయన్సర్లకు సంపాదన ఎక్కువగా వస్తోందని తెలిపింది. రొపోస్సో లేదా రీల్స్‌ వంటివి టిక్‌‌టాక్‌ ‌స్థాయిలో వ్యూవర్‌‌షిప్‌ లేదా మనీని సంపాదించడానికి ఇంకో రెండేళ్ల టైమ్‌‌పట్టొచ్చని పేర్కొంది.

కంటెంట్‌ క్రియేటర్లను ఆకర్షిస్తున్న యాప్‌లు..
టిక్‌‌టాక్‌ ‌బ్యాన్‌ ‌తర్వాత మిగిలిన షార్ట్‌ వీడియో కంటెంట్‌‌ యాప్‌లు టిక్‌‌టాక్‌ ‌ఇన్‌‌ఫ్లూయన్సర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయ సోషల్‌ మీడియా యాప్‌ చింగారి ఓ టాలెంట్‌‌ హంట్‌ ‌షోనూ ప్రకటించింది. టాప్‌ కంటెంట్‌‌ క్రియేటర్లు రూ.కోటి వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. అమెరికాకు చెందిన వీడియో ప్లాట్‌‌ఫామ్‌ ‌ఫైర్‌ వర్క్‌ క్రియేటర్‌ ఛాలెంజింగ్‌‌ను స్టార్ట్‌ చేసింది. ఇందులో రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు క్రియేటర్లకు ఆఫర్‌ చేస్తోంది. ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌కూడా కొంతమంది ఇన్‌‌ఫ్లూయన్సర్లతోనూ చర్చలు జరుపుతోంది.

For More News..

కరోనా వ్యాక్సిన్స్ డబ్బున్నోళ్లకే ఫస్ట్

అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు