మానసిక సమస్యలకు చెక్ పెట్టేందుకు...

మానసిక సమస్యలకు చెక్ పెట్టేందుకు...
  • యూనిక్ ​హెల్త్​ ఐడెంటిటీ కోసం డిజిటల్​ హెల్త్​ఎకో సిస్టమ్


న్యూఢిల్లీ: హెల్త్​ సెక్టార్​కు గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్​లో ప్రాధాన్యం పెరిగింది. హెల్త్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై దృష్టి పెడుతూనే, కరోనా వల్ల తలెత్తిన మెంటల్​హెల్త్ ఇష్యూస్ కు చెక్​ పెట్టేందుకు ఆర్థిక మంత్రి నేషనల్​టెలీ మెంటల్​ హెల్త్ ప్రోగ్రామ్​ ప్రకటించారు. హెల్త్​ఫెసిలిటీస్, యూనిక్ ​హెల్త్​ ఐడెంటిటీతోపాటు హెల్త్​ప్రొవైడర్స్​ డిజిటల్​ రిజిస్ట్రీల కోసం నేషనల్ ​డిజిటల్​హెల్త్​ఎకోసిస్టమ్​ఓపెన్​ ప్లాట్​ఫామ్​ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. విమెన్​ అండ్​ చైల్డ్ ​వెల్ఫేర్​కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి 2 లక్షల అంగన్​వాడీ సెంటర్లను అప్​గ్రేడ్​ చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా నిరుటి బడ్జెట్​తో పోలిస్తే హెల్త్​సెక్టార్​కు దాదాపు రూ. 12 వేల కోట్ల కేటాయింపులు పెంచారు. బడ్జెట్​సమర్పిస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మనం ఒమిక్రాన్ ​వేవ్ ​మధ్యలో ఉన్నాం. దేశంలో వ్యాక్సినేషన్​ క్యాంపెయిన్ ​స్పీడప్​ చేయడం బాగా ఉపయోగపడింది. సబ్‌కా ప్రయాస్‌తో మంచి వృద్ధి సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది” అని ఆమె పేర్కొన్నారు. 
హెల్త్​కేర్ ​సెక్టార్​లో ప్రోగ్రెస్:
దేశంలో112 జిల్లాల్లో 95 శాతం హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్​ఏర్పాటులో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత రెండేండ్ల నుంచి దేశంలో డెవలప్​చేసిన హెల్త్​ ఫెసిలిటీస్​ వల్ల కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోగలిగినట్లు నిర్మల తెలిపారు.
అంగన్​వాడీల అప్​గ్రేడేషన్:
సక్షమ్​ అంగన్‌వాడీల స్కీములో భాగంగా 2 లక్షల అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేయనున్నామని, దీని వల్ల అంగన్‌వాడీలకు మెరుగైన సౌలత్​లు సమకూరుతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్‌ను సమర్పిస్తూ.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు నారీ శక్తి ప్రాముఖ్యతను గుర్తించామన్నారు. మహిళల నేతృత్వంలోని దేశాభివృద్ధికి ‘అమృత్ కాల్’లో భాగంగా ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని పథకాలను సమగ్రంగా పునరుద్ధరించిందని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలకు సమగ్ర ప్రయోజనాలను అందించేందుకే ఇటీవల మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. “సక్షమ్​ అంగన్‌వాడీలు కొత్త తరం అంగన్‌వాడీలు, ఇందులో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉంటాయి. పిల్లలకు ఆడియో-విజువల్ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. పిల్లల సమగ్రాభివృద్ధికి మెరుగైన వాతావరణాన్ని అందిస్తాయి”అని నిర్మల ​తెలిపారు. 
ఆయుష్​శాఖకు రూ.3,050 కోట్లు
ఈసారి ఆయుష్​ శాఖకు బడ్జెట్​కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. నిరుడు రూ.2,970 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3,050 కోట్లు అలకేట్​చేశారు. మొత్తంగా 2.69 శాతం నిధులు పెరిగాయి. ఇందులో రూ.306 కోట్లు మినిస్ట్రీ కింద ఉన్న సెంట్రల్​సెక్టార్ ​స్కీమ్స్​కు కేటాయించగా, రూ.110 కోట్లు స్టాట్యుటరీ అండ్​రెగ్యులేటరీ బాడీస్​కు అలకేట్​చేశారు. సెంట్రల్​ కౌన్సిల్ ​ఫర్​ రీసెర్చ్​ ఇన్ ​యునాని మెడిసిన్​కు రూ.1759 కోట్లు, నేషనల్ ​ఆయుష్​మిషన్​కు రూ.800 కోట్లు కేటాయించారు. కాగా నిరుటి బడ్జెట్​లో ఆయుష్​ మిషన్​కు రూ. 553 కోట్లే ఇచ్చారు.
16 శాతం పెరిగిన కేటాయింపులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి హెల్త్​ సెక్టార్​కు నిధుల కేటాయింపు 16 శాతం పెంచారు. నిరుటితో పోలిస్తే దాదాపు రూ.12 వేల కోట్లు ఎక్కువ అలకేట్​ చేశారు. 2021–22 ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ.73,931 కోట్లు కేటాయించగా.. ఈసారి 16 శాతం నిధులు పెంచి రూ.86,200.65 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో హెల్త్​అండ్ ​ఫ్యామిలీ వెల్ఫేర్ ​డిపార్ట్​మెంట్​కు రూ.83,000 కోట్లు, హెల్త్​రీసెర్చ్​డిపార్ట్​మెంట్​కు రూ. 3,200 కోట్లు ఇచ్చారు. సెంట్రల్​ సెక్టార్​ స్కీమ్స్, ప్రాజెక్టుల బడ్జెట్​రూ.10,566 కోట్ల నుంచి రూ.15,163 కోట్లకు పెరిగింది.

ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన నిధులు రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెరిగాయి. నిరుడు నేషనల్​ హెల్త్​ మిషన్ (ఎన్ హెచ్ఎం)కు రూ.36,576 కోట్లు కేటాయించగా ఈసారి మొత్తంగా రూ.37,800 కోట్లకు పెంచారు. నేషనల్​ డిజిటల్​ హెల్త్​ మిషన్ (ఎన్​హెచ్ఎం)కు రూ.30 కోట్ల నుంచి రూ.200 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. హెల్త్​సెక్టార్​అటానమస్ ​బాడీస్​కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,566 కోట్లు కేటాయించగా, ఈసారి 10,022 కోట్లకు పెంచారు. స్టాట్యుటరీ, రెగ్యులేటరీ బాడీస్ కు నిధులు కొంత మేర పెరిగాయి. నిరుడు రూ.315 కోట్లు అలకేట్​ చేయగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.335 కోట్లకు పెంచారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్: నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫామ్ రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో హెల్త్​ ప్రొవైడర్స్​ డిజిటల్ రిజిస్ట్రీలు, ఆరోగ్య సౌకర్యాలు, యూనిక్ ​హెల్త్​ఐడెంటిటీ, హెల్త్​ ఫెసిలిటీస్​కు సంబంధించి యూనివర్సల్​ యాక్సెస్​ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్: కరోనా అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య సమస్యలు పెంచింది. వాటికి చెక్ పెట్టి ప్రజల మెంటల్ హెల్త్ కాపాడాలనే ఉద్దేశంతో క్వాలిటీ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కోసం ‘నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నెట్ వర్క్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి ఐఐఐటీ బెంగళూరు టెక్నికల్ సపోర్ట్ అందించనుంది.