
పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో అనుకున్న సమయానికి రాకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతోంది. నిన్నటి నుంచి వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. మదన్‌పల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పవన్‌పై ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూట్ మొత్తం కంప్లీటవనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్‌ని ఫినిష్ చేసే ప్లాన్స్‌లో ఉన్నారు. చెప్పిన టైమ్‌కి వస్తామంటూ ఇప్పటికే రెండు, మూడుసార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయినా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. సముద్రఖని, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే రాస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.