నెలరోజుల క్రితం థియేటర్లలో విడుదలైన రెండు తెలుగు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఒకటి విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’. ప్రముఖ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం థియేటర్ ఆడియన్స్ని. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
మరొకటి తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హ్యాపీ రాజ్’. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ రెండు సినిమాలు ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం. అయితే, ఈ రెండు సినిమాలే కాదు.. ఓ 15కి పైగా సినిమాలు కూడా వివిధ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చి సందడి చేస్తున్నాయి.
‘బ్యాండ్ మేళం’(Band Melam):
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా సతీష్ జవ్వాజీ తెరకెక్కించిన ‘బ్యాండ్ మేళం’ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జీ5'లో ఇవాళ ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో హర్ష్ రోషన్, శ్రీదేవి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే
‘‘నిరీక్షణ ముగిసింది. బ్లాక్ బస్టర్ జోడీ తిరిగొచ్చింది. జీ5లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న బ్యాండ్ మేళం మూవీని చూసేయండి’’ అని జీ5 ప్రకటించింది.
The wait is over.
— ZEE5 Telugu (@ZEE5Telugu) April 23, 2026
The blockbuster pair is back!
Watch #BandMelam
Streaming now only on ZEE5.
#HarshRoshan #SriDevi #TeluguZee5 #bandmelamonzee5 pic.twitter.com/p0N8a3eIqn
‘బ్యాండ్ మేళం’ స్టోరీ:
యాదగిరి అలియాస్ గిరి (హర్ష్ రోషన్)కి సంగీతంపై అపారమైన ఆసక్తి. టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత స్నేహితులతో కలిసి బ్యాండ్ మేళం నిర్వహిస్తూ జీవనం సాగిస్తాడు. చిన్నప్పటి నుంచే తన మరదలు రాజీ (శ్రీదేవి)పై ప్రేమ పెంచుకుంటాడు. ఇద్దరి పెళ్లి కూడా కుటుంబం ముందుగానే నిర్ణయిస్తారు.
కానీ పరిస్థితులు మారిపోతాయి. గిరి కుటుంబం పేదరికంలో పడిపోతే, రాజీ కుటుంబం రిచ్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో రాజీ గిరిని పట్టించుకోకుండా, ఆమెకు మరో సంబంధం కుదురుతుంది. అయితే పెళ్లి రోజే రాజీ తన ప్రియుడితో వెళ్లిపోవడం గిరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత గిరి తీసుకున్న నిర్ణయాలు ఏంటీ? అతని జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే మిగతా కథ.
హ్యాపీ రాజ్(Happy Raj):
టాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దీనికి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. రిఫ్రెషింగ్ ఫ్యామిలీ & ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. IMDBలో 6.9 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
ఇదొక సాధారణ ప్రేమకథలా మొదలై, కుటుంబ విలువలు, సంస్కృతి భేదాలు, భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. గ్రామం నుంచి నగరానికి వెళ్లే ఒక యువకుడి ప్రయాణాన్ని సహజంగా చూపించారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ మాత్రం సరళంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
awaiting on your screens…he’s Happy to meet you 😌#HappyRajOnPrime, New Movie, Watch Now: https://t.co/2gqcb2axoS@gvprakash @actorabbas @srigouripriya @maria_raja_elan #GeorgeMaryan@kailasam_geetha pic.twitter.com/3ZxcSxcvVg
— prime video IN (@PrimeVideoIN) April 23, 2026
హ్యాపీ రాజ్ కథ:
ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ (జీవీ ప్రకాష్) తన తండ్రి (జార్జ్ మరియన్) ప్రవర్తన వల్ల గ్రామంలో అవమానాలను ఎదుర్కొంటాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు బెంగళూరుకు వెళ్లి కార్పొరేట్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అక్కడ కావ్య (శ్రీ గౌరి ప్రియ)తో ప్రేమలో పడతాడు.
కానీ ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్న సంస్కృతి, సంప్రదాయ భేదాలు వారి ప్రేమకు అడ్డంకిగా మారుతాయి. ఆ సమస్యలను హ్యాపీ రాజ్ ఎలా ఎదుర్కొని తన ప్రేమను నిలబెట్టుకున్నాడన్నదే కథ.
నెట్‌ఫ్లిక్స్
అపెక్స్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 24
నుక్కడ్ నాటక్(హిందీ)- ఏప్రిల్ 24
ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్)- ఏప్రిల్ 24
నీ ఫరెవర్ (హిందీ)- ఏప్రిల్ 24
సోనిక్ 3 ది హెడ్జ్‌హాగ్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24
అన్‌కామన్ వాలర్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్) - ఏప్రిల్ 24
జియో హాట్‌స్టార్
ప్రతి ఛాయ (మలయాళ) - ఏప్రిల్ 24
24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24
జీ5
జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24
అమెజాన్ ప్రైమ్
నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24
న్యూ బండిట్స్- సీజన్-2 (హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24
ఇమ్మార్షల్ కాంబాట్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24

