
టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు శస్త్రచికిత్స జరిగింది. గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేశ్ బాబు.. కుటుంబ సమేతంగా స్పెయిన్ వెళ్లారు. డాక్టర్ల సూచనతో స్పెయిన్ లో సర్జరీ చేయించుకున్నారు.. సర్జరీ తర్వాత దుబాయ్ కి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు మహేశ్.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు మహేశ్ బాబు. ప్రస్తుతం మహేశ్ బాబు లేని సన్నివేశాలు చిత్రీకరిస్తోంది యూనిట్. 2022 ఫిబ్రవరి నుండి మహేశ్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ లో విడుదల కానుంది సర్కారు వారి పాట.