Naresh Pavithra : నరేష్ – పవిత్ర పెళ్లి నిజమా.. అబద్దమా

 Naresh Pavithra : నరేష్ – పవిత్ర పెళ్లి నిజమా.. అబద్దమా

నరేష్  – పవిత్ర పెళ్లి చేసుకున్నట్లు.. స్వయంగా నరేష్ తన ట్విట్టర్ నుంచి వీడియో రిలీజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగినట్లు మీడియాకు వీడియో రిలీజ్ చేసి హల్ చల్ చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం మూడు ముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. మూడు ముళ్లు.. ఏడు అడుగులకు మీ ఆశీర్వాదం కావాలంటూ కామెంట్ కూడా పెట్టారు.. దీంతో అందరూ నిజంగా పెళ్లి అయిపోయినట్లు భావించారు.. 

 

నరేష్ పెళ్లి వీడియోపై సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది ఓ సినిమా షూటింగ్ లో పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. దీనిపైనా క్లారిటీ ఇవ్వలేదు నరేష్ - పవిత్ర. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది అనే విషయంలోనూ స్పష్టత రాలేదు.

నరేష్ పెళ్లి విషయంలో మూడో భార్య రమ్యతో కొంత కాలంగా వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే విడాకులు ఇవ్వకుండానే ఎలా పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు తలెత్తాయి. నరేష్ – రమ్య మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. కేసులు నమోదయ్యాయి. ఇలాంటి టైంలో ఏ దైర్యంతో నరేష్ పెళ్లి వీడియో రిలీజ్ చేశాడనేది ఆసక్తిగా మారింది. ఈ ప్రశ్నలు వచ్చిన సమయంలో.. వీడియో డిలీట్ కావటం.. ఆ పెళ్లి సీన్ సినిమాలోనిది అనే కొత్త ప్రచారం రావటం గందరగోళానికి దారి తీసింది.. ఇంతకీ నరేష్ - పవిత్ర పెళ్లి నిజమా.. అబద్దమా.. సినిమా పెళ్లా లేక భయపడ్డడా అనేది తెలియాల్సి ఉంది.. వెయిట్ అండ్ సీ...