తెలుగు సినిమా పరిశ్రమ , మనదేశంలో అతిపెద్ద సినిమా రంగాల్లో ఒకటి. కొన్ని వేల మందికి ఇది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తుంది. ఒక సినిమా విజయవంతం కావడానికి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎంత ముఖ్యమో, తెర వెనుక పనిచేసే వేలాది మంది కార్మికులు కూడా అంతే ముఖ్యం. లైట్ బాయ్ నుండి ఆర్ట్ డైరెక్టర్ వరకు, మేకప్ మ్యాన్ నుండి స్టంట్ మాస్టర్ వరకు ప్రతి ఒక్కరి శ్రమతోనే ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది.
బాలీవుడ్ తర్వాత రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న టాలీవుడ్ ప్రస్తుతం కార్మికుల వేతనాల విషయంలో కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ వేతానాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది . దీంతో మొత్తం 24 క్రాప్ట్ లకు చెందిన కార్మికులు బంద్ లో పాల్గొంటున్నారు. ఒప్పందం ప్రకారం మూడేళ్ల తర్వాత జూన్ 30 నాటికే ఈ వేతనాలు పెంపును వర్తింపజేయాల్సి ఉంది. కానీ గత నాలుగుల నెలలుగా తమ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిర్మాతల మండలి (Telugu Film Chamber of Commerce - TFCC) కార్మికుల డిమాండ్‌ను వ్యతిరేకించింది. చిన్న నిర్మాతలు ఈ వేతన పెంపును భరించలేరని, ఇది పరిశ్రమకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని వాదించింది. నిజానికి, ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ, తెలుగు కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నామని ఛాంబర్ పేర్కొంది. దీనితోపాటు, నిర్మాతల మండలి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యూనియన్‌లో లేని నైపుణ్యం ఉన్న కార్మికులను కూడా షూటింగ్‌ల కోసం నియమించుకోవచ్చని ప్రకటించింది.
ALSO READ : ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడితో నటి తమన్నా ప్రత్యేక జెట్ ప్రయాణం.. ఇద్దరి మధ్య సంబంధంపై చర్చ!
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 28 వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 4 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వీరంతా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్నారు. ఒప్పందం ప్రకారం మూడేళ్ల తర్వాత 30 శాతం వేతానాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 30 శాతం పెంచాల్సిందే అని ఆగస్టు 4 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. వీరిలో జూనియర్ ఆర్టి్స్లులకు రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఇస్తున్నారు. మిగిలిన కార్మికులకు రూ. 800 నుంచి రూ.18 వందల వరకు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఆగస్ట్ 4 నుంచి షూటింగ్స్ మొత్తం ఆపేస్తున్నట్లు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయినా ఎవరూ నోరు మెదపకపోవడంతో షూటింగ్స్ ఆగిపోయాయి.
రోజు వారీగా కొంతమంది కార్మికుల వేతనాలు పరిశీలిస్తే..
జూనియర్ ఆర్టిస్టులు : రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు
ఎలక్ట్రీషియన్/లైట్‌మ్యాన్ ఇన్‌చార్జి: రూ. 1400
లైట్‌మ్యాన్: రూ. 1161
ప్రొడక్షన్ బాయ్ ఇన్‌చార్జి: రూ. 1400
ప్రొడక్షన్ బాయ్: రూ. 1127
హెడ్ కార్పెంటర్/పెయింటర్: రూ. 1400
హెడ్ వెల్డర్/పీస్ మోల్డర్: రూ. 1400
అయితే ఈ వేతనాలు కార్మికుల పనితీరు, సమయాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఇస్తున్న వేతానాలకు అదనంగా మరో 30 శాతం పెంచాలంటే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని నిర్మాతల వాదన. తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమలతో పోల్చితే మన తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులకు ఎక్కువగా చెల్లిస్తున్నామని చెబుతున్నారు. కనీసం వెయ్యి నుంచి 2 వేల వరకు వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సినిమా పైరసీతో పాటు OTT వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందని నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. 30 శాతం మేర జీతాలు పెంచాలంటే చిన్న చిత్రాలు బతకలేవని తెలిపారు. యూనియన్ సభ్యులతో సబంధం లేకుండా ప్రతిభ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్స్ బంద్ చేసిన కార్మికులు.. నిర్మాత మండలి తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
