కేరళలో చిన్నారులను కలవరపెడుతున్న టమాటో ఫ్లూ

కేరళలో చిన్నారులను కలవరపెడుతున్న టమాటో ఫ్లూ

కేరళ : కేరళ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఈ టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వ్యాపిస్తున్న ఈ ఇన్‌ఫెక్షన్ ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకుపైనే సోకింది. కోల్లాం ప్రాంతంలో ఎక్కువగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఇన్‌ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా వైద్యశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

టమాటో ఫ్లూ అంటే
ఇది అరుదైన వ్యాధి. టమాటో ఫ్లూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్‌ ప్రభావం కనిపిస్తోంది. 

పిల్లల్లో లక్షణాలు ఇలా ఉంటాయి..
టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్‌గున్యా తరహాలోనే ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్‌, నెడువతుర్‌ ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 

అంతుచిక్కని వ్యాధి కలకలంతో సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు కొల్లంలో అంగన్ వాడీ సెంటర్లను మూసివేశారు. వేగంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన పిల్లలను ఇతర చిన్నారులకు దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్‌ కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో మాత్రమే టమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తల కోసం.. 

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు