పాక్‌లో కిలో టమాటా రూ.300

పాక్‌లో కిలో టమాటా రూ.300

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌తో ఒక్కొక్కటిగా అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. కశ్మీరు ప్రజలకు సంఘీభావంగా వాణిజ్య సంబంధాలను కూడా తెంచేసుకుంది. ఫలితంగా భారత్ నుంచి కూరగాయలు, నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆ దేశ ప్రజలకు ఇబ్బందులుకు గురి చేస్తోంది.

భారత్ నుంచి నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో ధరలు  భారీగా పెరిగాయి. కిలో టమాటల ధర ఏకంగా రూ.300కు చేరింది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు కొనలేక విలవిల్లాడుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నా అవి సరిపోవడం లేదు.