న్యూఢిల్లీ : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) లపై ఇస్తున్నాయి. వీటితో ఎనిమిది శాతానికి పైగా వడ్డీ పొందొచ్చు. వివరాలివి.
1. మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికేట్ కార్పొరేట్ ఎఫ్డీలపై ఏటా 8.25 శాతం వడ్డీ ఇస్తోంది.
2. శ్రీరామ్ ఫైనాన్స్ ఏడాదికి 8.18 శాతం వడ్డీ ఇస్తోంది. డిపాజిట్లు మెచ్యూర్ అయ్యాక రెన్యువల్ చేసుకుంటే ఏడాదికి అదనంగా 0.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అదనంగా మహిళా డిపాజిటర్లకు 0.10 శాతం వడ్డీ ఇస్తోంది.
3. ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏడాదికి 8.07 శాతం వడ్డీ అందిస్తోంది.
4. మహీంద్రా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.05 శాతం చొప్పున వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
5. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేట్ ఎఫ్డీలపై ఏడాదికి 7.85 శాతం ఇస్తోంది.
6. సుందరం హోమ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లు మూడేళ్ల కాల పరిమితి గల కార్పొరేట్ ఎఫ్డీలపై ఏడాదికి 7.75 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నాయి.