జేపీ నడ్డా భార్య కారు చోరీ

జేపీ నడ్డా భార్య కారు చోరీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య మల్లికా నడ్డా కారును దుండగులు కొట్టేశారు. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవింద్ పురి పరిధిలో ఈ నెల 19 మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగింది. ఇంతవరకు కారు దొరకలేదు. డ్రైవర్ జోగిందర్ ఫార్చునర్ కారును సర్వీసింగ్ చేయించుకుని... నడ్డా ఇంటికి తిరిగి తీసుకెళ్తుండగా భోజనం కోసం కారును తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. భోజనం చేసి వచ్చేసరికి ఇంటి ముందు కారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు జోగిందర్. 

పోలీసులు FIR నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నారు. సీసీటీవీలో కారు గురుగ్రాం వైపుకు వెళ్లినట్టు కనిపించింది. కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉంది. 6 రోజులైనా కారు ఆచూకీ లభించకపోవడంతో 7 టీంలతో కారు కోసం సెర్చ్ చేస్తున్నారు పోలీసులు.