కేసీఆర్ చేతిలో మోసపోయామని అందరు బాధపడుతున్రు : రేవంత్ రెడ్డి

 కేసీఆర్ చేతిలో మోసపోయామని అందరు బాధపడుతున్రు : రేవంత్ రెడ్డి

ఈ నెల 9న కరీంనగర్లో సభను నిర్వహిస్తామని కార్యకర్తలు తరలిరావలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గంగాధర కార్నర్ మీట్ంగ్లో పాల్గోన్నారు. ఎన్ని వేల మంది పోలీసులు... లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడిన సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. కరీంనగర్ , వరంగల్ జిల్లాలకు 13 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నీళ్లు అందించామని చెప్పారు. చొప్పదండికి చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదని ఆరోపించారు.

కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రేవంత్ విమర్శించారు. 2014 నుంచి 2020 వరకు 2లక్షల మంది రైతులు చనిపోయారని రేవంత్ తెలిపారు. కేసీఆర్ చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బొయినపల్లి వినోద్, బండి సంజయ్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదని  రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని, సోనియా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్న రేవంత్.. ఈ బంధనాలు తెంచి తెలంగాణ తల్లిని విడిపిస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.