బిగ్ స్టోరీ : హైదరాబాద్ లోనూ బేసి, సరి సంఖ్య వాహనాల విధానం రాబోతుందా..?

బిగ్ స్టోరీ : హైదరాబాద్ లోనూ బేసి, సరి సంఖ్య వాహనాల విధానం రాబోతుందా..?

హైదరాబాద్ ట్రాఫిక్ పీక్ స్టేజ్ కు వచ్చేసింది. ఎక్కడకు వెళ్లాలన్నా గంటల కొద్దీ సమయం పడుతుంది.. కాలనీల్లోనూ ట్రాఫిక్.,. ట్రాఫిక్.. ఉదయం, సాయంత్రం ఆఫీసులకు వెళ్లే సమయంలో.. వచ్చే సమయంలో అయితే 15 కిలోమీటర్ల జర్నీకి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది.. దీనికితోడు ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డుక్కుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి 85 లక్షల వాహనాలు ఉన్నాయి. ఒక్క 2023 డిసెంబర్ నాటికి 16 వేల వాహనాలు కొత్తగా రోడ్డెక్కాయి.. వీటిలో టూ వీలర్స్, కార్లు, గూడ్స్, బస్సులు ఇలాంటి అన్నీ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ మరింత పెరిగి పొల్యూషన్ తోపాటు.. ప్రయాణ సమయం రోజు రోజుకు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ సిటీలోనూ ఢిల్లీ, ముంబై తరహాలో.. బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనపై.. ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతుంది.

వాహనాలు రోడ్డెక్కటానికి బేసి, సరి సంఖ్య విధానాన్ని ఢిల్లీ, ముంబైలో అమల్లో ఉంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ 20 శాతం వరకు తగ్గినట్లు అంచనా. ఇదే సమయంలో బైక్స్, కార్ల వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కారు పూలింగ్ విధానాల్లో అమల్లోకి తీసుకురావాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఆలోచనగా ఉంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గటంతోపాటు వ్యక్తిగత వాహనాలు రోడ్డుపైకి రాకపోవటం వల్ల వాయు, శబ్ధ కాలుష్యం తగ్గుతుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగం పెరుగుతుంది. కారు పూలింగ్ విధానం వల్ల.. ఐటీ కారిడార్ లో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తుంది ట్రాఫిక్ పోలీస్ విభాగం. ఇదే సమయంలో కాలనీల నుంచి మెట్రోకు ప్రత్యేక బస్సులు నడపటం, మెట్రో వినియోగాన్ని పెంచటం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు ఉన్నతాధికారులు.

బేసి, సరి సంఖ్య విధానం అంటే ఏంటీ..?

బేసి సరి సంఖ్య విధానం అంటే.. మీ బైక్ లేదా కారు నెంబర్ లో చివరి సంఖ్య.. ఎగ్జాంపుల్ మీ వాహనం నెంబర్ 2345 అనుకోండి.. మీ చివరి నెంబర్ 5.. సో.. మీది బేసి సంఖ్య.. అప్పుడు మీ వాహనాన్ని 1, 3, 5, 7, 9, 12, 14, 16, 18, 21, 23, 25 ఈ తేదీల్లోనే రోడ్డెక్కాలి.. అదే మీ వాహనం నెంబర్ 1234 అనుకోండి.. చివరి నెంబర్ 4.. సరి సంఖ్య.. అప్పుడు మీ వాహనం 2, 4, 6, 8, 11, 13, 15, 17, 20, 22, 24, 26, 29 తేదీల్లోనే రోడ్డెక్కాలి. మిగతా రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా కారు పూలింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.. 

ఎలక్ట్రికల్ వాహనాలకు మినహాయింపు :

బేసి, సరి సంఖ్య విధానంలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చాయి ఢిల్లీ, ముంబై ప్రభుత్వాలు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే విధంగా ట్యాక్సీలు, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి పబ్లిక్ సర్వీసులకు అన్ని రోజులు అనుమతి ఉంటుంది. ఇదే సమయంలో హైదరాబాద్ సిటీలో కొత్తగా.. కొత్త బస్సులను తీసుకురావటం ద్వారా.. ప్రయాణికులకు వెసలుబాటు కల్పించినట్లు అవుతుంది. స్కూల్ బస్సులు, వృద్ధులు, మహిళలకు సంబంధించిన ప్రత్యేక బస్సులకు ఈ విధానంలో ఆయా ప్రభుత్వాలు వెసలుబాటు కల్పించాయి..

హైదరాబాద్ లోనూ బేసి, సరి సంఖ్య విధానంపై ప్రస్తుతానికి ఆలోచన మాత్రమే చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 90 లక్షలకు చేరుకుంటున్న వాహనాలను నియంత్రించటంతోపాటు.. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి.. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం.. ఈ విధానం ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు. చూడాలి.. దీనిపై తుది నిర్ణయం ఎలా ఉంటుంది అనేది..