సమ్మర్​లో ఓవర్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు వద్దంటున్న ట్రైనర్లు

సమ్మర్​లో ఓవర్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు వద్దంటున్న ట్రైనర్లు

హైదరాబాద్, వెలుగు: హెల్దీగా, ఫిట్‌‌గా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. దీంతో మునుపటితో పోలిస్తే జిమ్‌‌లలో జాయిన్ అవుతున్నవారి సంఖ్య అధికమవుతోంది. వయసుతో సంబంధం లేకుండా జిమ్​లో జాయిన్​అయ్యి వర్కవుట్స్ చేస్తున్నారు. యువతతో..  మిడిల్ ఏజ్, ఓల్డేజ్ వాళ్లు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతోన్న గుండెపోటు మరణాల నేపథ్యంలో.. అనారోగ్య సమస్యలున్నవారు వర్కవుట్స్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో ఇష్టమొచ్చినట్లు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయొద్దని, సొంత డైట్‌‌లు ఫాలో అవుతూ గంటల తరబడి వర్కవుట్స్ చేస్తే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

గంటల తరబడి వద్దు

జనాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుండటంతో కొందరు జిమ్‌‌లు, ఫిట్​నెస్ స్టూడియోల్లో చేరి మరికొందరు సొంతంగా ఇంటి దగ్గరే ఎక్సర్‌‌‌‌సైజ్​లు చేస్తున్నారు. అనేక రకాల ఫిట్​నెస్, డైట్ యాప్​లు అందుబాటులో ఉండటంతో వాటిని చూస్తూ కసరత్తులు చేస్తున్నారు. ఫిట్​గా ఉండాలనే ఆలోచనతో, కేలరీలను కరిగించుకోవడమే పనిగా చాలామంది గంటల తరబడి ఎక్సర్ సైజ్​లు చేస్తున్నారు. అయితే నచ్చినట్టుగా వర్కవుట్లు చేస్తే బాడీ తట్టుకోలేదని జిమ్ ట్రైనర్లు చెప్తున్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సమయంలో రోజుకు రెండు, మూడు గంటలు ఎక్సర్‌‌‌‌సైజ్​లు చేయడంవల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు ట్రైనర్ పర్యవేక్షణలోనే వర్కవుట్స్ చేయాలని సూచిస్తున్నారు.

ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి..

సమ్మర్​లో బాడీ డీహైడ్రేట్ అయిపోతుందని, అలాంటి సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుందని డైటీషియన్లు అంటున్నారు. జిమ్ చేసేవారు అలసటకు గురవుతుంటారని, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాములు రోజుల కంటే సమ్మర్​లో ఇంకా ఎక్కువగా నీళ్లు తాగుతుంటాం. ఇక సమ్మర్​లో జిమ్ చేసేటప్పుడు బాడీ డీహైడ్రేట్​కాకుండా నీళ్లతోపాటు ఇతర ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. కొబ్బరి నీళ్లు, లెమన్ సాల్ట్ వాటర్, బటర్ మిల్క్, రాగి జావ, సూప్స్ తీసుకోవాలంటున్నారు.

అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి

సమ్మర్​లో బాడీని ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకూడదు. వర్కవుట్స్ హెవీగా కాకుండా స్లోగా స్టార్ట్ చేయాలి. జిమ్‌‌లో కొత్తగా జాయిన్ అయ్యేవారు తమను తాము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా అని చూసుకోవాలి. బాడీని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలి. – తరుణ్య, యోగా అండ్ జిమ్ ట్రైనర్