వారణాసిలో మోదీపై ట్రాన్స్​జెండర్ పోటీ

వారణాసిలో మోదీపై  ట్రాన్స్​జెండర్ పోటీ
  • ఎన్నికల బరిలో హేమంగి సఖి
  • అఖిల భారత హిందూ మహా సభ పార్టీ నుంచి టికెట్
  • ట్రాన్స్​జెండర్ల సమస్యలు తీర్చేందుకే..

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీపై ట్రాన్స్ జెండర్ పోటీ చేయనున్నారు. వారణాసి నుంచి నిర్మోహి అఖాడా శాఖకు చెందిన ట్రాన్స్​జెండర్ హేమంగి సఖి బరిలోకి దిగనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలుచుంటారని ఆ పార్టీ చీఫ్ స్వామి చక్రపాణి వెల్లడించారు. ట్రాన్స్‌‌‌‌జెండర్ల హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని హేమంగి చెప్పారు. ప్రచారం గురించి ఎలాంటి ఆలోచన లేదన్నారు. ‘‘నేను మోదీని గౌరవిస్తా. ఆయన చేపట్టిన పథకాలు బాగున్నాయి. కిన్నెరల సమస్యలు ఫోకస్ కావాలి. అందుకే పోటీ చేస్తాను” అని హేమంగి పేర్కొన్నారు. 

భగవత్​గీతను బోధించే తొలి ట్రాన్స్ జెండర్

గుజరాత్​లోని బరోడాలో హేమంగి జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా ముంబైకి మకాం మార్చారు. అక్కడే పెరిగిన హేమంగి తల్లిదండ్రుల మరణం, సోదరి వివాహం తర్వాత శ్రీకృష్ణుడి ఆరాధన ప్రారంభించారు. ఈమె భగవత్​గీతను బోధిస్తున్న ప్రపంచంలోనే తొలి ట్రాన్స్ జెండర్ కావడం విశేషం.