డాటా ఎంట్రీనా? ఆలోచించాల్సిందే

డాటా ఎంట్రీనా? ఆలోచించాల్సిందే

జాబ్‌‌ లేని యూత్‌‌ టార్గెట్‌‌గా ‘మా దగ్గర డాటా ఎంట్రీ జాబ్స్‌‌ ఉన్నాయనే’ యాడ్స్‌‌ ఆన్‌‌లైన్‌‌లో కనిపిస్తుంటాయి. లేదంటే మెయిల్స్‌‌, ఫోన్‌‌ నెంబర్‌‌‌‌కు టెక్స్ట్‌‌ మెసేజ్‌‌లు వస్తుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే మోసపోవడం ఖాయం. 

ఈ అడ్వర్డైజ్‌‌మెంట్స్‌‌ ఎలా ఉంటాయంటే... ‘మీరు 10వ తరగతి ఫెయిల్‌‌ అయినా సరే ఆన్‌‌లైన్‌‌లో పార్ట్‌‌ టైం జాబ్‌‌ చేసి నెలకు 30వేల వరకు సంపాదించొచ్చు. మీరు చేయా ల్సిందల్లా ఇంటినుండే సెల్‌‌ ఫోన్‌‌, ల్యాప్‌‌ టాప్‌‌ వాడటం’ అంటూ మెసేజ్‌‌లు వస్తాయి. వీటిలో కొన్ని జెన్యూన్‌‌ వెబ్‌‌సైట్స్‌‌ ఉన్నా... వాటిని అడ్డం పెట్టుకొని కొన్ని ఫేక్‌‌ వెబ్‌‌సైట్స్‌‌ ఈ డాటా ఎంట్రీ దందా నడిపిస్తుంటాయి. ‘నేనెప్పుడూ డాటా ఎంట్రీ గురించిన వెబ్‌‌సైట్స్‌‌, లింక్స్‌‌ ఓపెన్‌‌ చేయలేదే అయినా నా కాంటాక్ట్ డీటెయిల్స్‌‌ వాళ్ల దగ్గర ఎలా ఉన్నాయి’ అనుకుంటున్నారా. ఇంతకుముందు మీ ఫోన్‌‌లో ఏవైనా వెబ్‌‌సైట్స్‌‌ ఓపెన్‌‌ చేసినా, థర్ట్‌‌ పార్టీ యాప్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకున్నా, ఏదైనా అప్లై చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్‌‌, మెయిల్‌‌ ఐడీ, ఫోన్‌‌ నెంబర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌ చేసినా మీ పూర్తి ఇన్ఫర్మేషన్‌‌ స్టోర్ అయిపోతుంది.

ఎలా మోసం చేస్తారంటే... 

డాటా ఎంట్రీ జాబ్‌‌ అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ చూడగానే డబ్బు సంపాదించొచ్చు అని తన పూర్తి ఇన్ఫర్మేషన్‌‌ను ఫొటోతో సహా ఇచ్చాడు ఒకతను. అదో ఫ్రాడ్‌‌ వెబ్‌‌సైట్. 15 రోజుల్లో 9000 క్యాప్‌‌చాల డాటా ఎంట్రీ చేస్తే 25,000ల జీతం అన్నారు. ఈ టాస్క్‌‌ను ఇదివరకు చాలామంది కంప్లీట్‌‌ చేసి డబ్బు సంపాదించారని కొందరి ఫొటోలు చూపించి, అతన్ని నమ్మించారు. వాళ్లు ఇచ్చిన 15 రోజుల గడువులో ఆ టాస్క్‌‌ పూర్తి చేయలేకపోయాడతను. ఆ ఫ్రాడ్‌‌ కంపెనీ తమకు తగ్గట్టు కొన్ని టర్మ్స్‌‌ అండ్‌‌ కండీషన్స్‌‌ను యాక్సెప్ట్‌‌ చేయించుకున్నారు. దాంతో మోసపోయానని తెలిసినా... అతనేం చేయలేకపోయాడు. 

అంతటితో ఈ కథ పూర్తి కాలేదు. అసలు విషయం అప్పుడే మొదలైంది ‘మేము ఇచ్చిన గడువులో నువ్వు టాస్క్‌‌ను పూర్తి చేయలేదు. అందువల్ల మా కంపెనీకి చాలా నష్టం వచ్చింది. దాన్ని నువ్వే తీర్చాలి. లేదంటే పోలీస్‌‌ కంప్లైంట్‌‌ ఇస్తాం. దాని కోసం నువ్వు అహ్మదాబాద్‌‌ రావాల్సి ఉంటుంది’’ అని అతన్ని బెదిరించారు. అంతేకాకుండా ఈ కేస్‌‌ను వెనక్కి తీసుకోవాలంటే ముందు మాకు 30,000 కట్టాలన్నారు. భయపడి ఏమి ఆలోచించకుండా వాళ్లకు డబ్బు పంపాడు. తరువాత నెల మళ్లీ ఫోన్‌‌ చేసి ‘నువ్వు కట్టిన డబ్బు ఆ నెల కోసమే. మళ్లీ మీ కేసు ఓపెన్‌‌ అయింది. దాన్ని క్లోజ్‌‌ చేయాలంటే ఇంకొక 10,000 అవసరం’ అని తీసుకున్నారు. అప్పుడు వాళ్ల గురించి పోలీస్‌‌ కంప్లైంట్‌‌ ఇచ్చినా లాభం లేక పోయింది. ఎందుకంటే వాళ్లవి ఫేక్‌‌ ఐడి ప్రూఫ్స్‌‌.

ఇలా గుర్తుపట్టొచ్చు

ఫేక్‌‌ సంస్థలను ఎలా గుర్తించాలంటే... ఫలానా వాటిల్లో చేరండి అని మీకు మెయిల్స్‌‌, మెసేజెస్‌‌ పంపితే వాటి గురించి గూగుల్‌‌లో వెతకాలి. అవి జెన్యూన్‌‌ అయితేనే వాటిలో చేరాలి. యాడ్స్‌‌, ప్రమోషన్స్‌‌లాగా గూగుల్‌‌లో కనిపించేవన్నీ నిజమైనవి కాదు. ఆ ఫేక్‌‌ డాటా ఎంట్రీ వాళ్లు గూగుల్‌‌కు డబ్బు కట్టి వాటిని యాడ్స్‌‌లా వేయించుకుంటారు. గూగుల్‌‌ సెర్చ్‌‌ లో వాటి గురించి వెతుకుతున్నపుడు అన్నింటి కన్నా ముందు వచ్చే వాటిముందు ‘ఎడి’ అని ఉంటుంది. అలా ఉంటే అది అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ అని అర్థం. వాటిని పొరపాటున కూడా ఓపెన్‌‌ చేయొద్దు. అలాగని అన్నీ ఫేక్‌‌వే అని కాదు... కొన్ని జెన్యూన్‌‌ డాటా ఎంట్రీ వెబ్‌‌సైట్‌‌లు కూడా ఉంటాయి. అందుకే ఏదైనా చేసేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.

మరిన్ని వార్తల కోసం..

ఎల్ఐసీలో భారీగా ఎవరూ క్లెయిమ్​ చేయని డబ్బు

జనానికి మంట.. కంపెనీలకు పంట

సారలమ్మ వచ్చె.. సంబురం తెచ్చె