అవార్డు గ్రహీతకు సన్మానం

అవార్డు గ్రహీతకు సన్మానం

ఊట్కూర్, వెలుగు: గ్లోబల్  ఐకాన్  అవార్డుకు ఎంపికైన మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన రిషి కుమార్ ను శనివారం మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన ఇంట్లో ఘనంగా సన్మానించారు. మంజునాథ ఫౌండేషన్  తృతీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్  రవీంద్ర భారతిలో అవార్డు అందుకున్న రిషి కుమార్ ను అభినందించారు. సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. వాకిటి శ్రీనివాస్, కావలి తాయప్ప, నాగేశ్వర్ రావు, తమ్మప్ప, రాకేశ్, కిరణ్ కుమార్  పాల్గొన్నారు.