ట్రిపుల్ తలాక్ బిల్లు : లోక్ సభలో గందరగోళం

ట్రిపుల్ తలాక్ బిల్లు : లోక్ సభలో గందరగోళం

ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో గందరగోళం సృష్టించింది. బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్. అయితే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బిల్లుకు అభ్యంతరం తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని వాదించారు. ఈ సందర్భంగా… అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గలాటా జరిగింది. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే రవిశంకర్ ప్రసాద్ బిల్లును పరిచయం చేశారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు ఈ చట్టం తీసుకొచ్చామని చెప్పారు.