టీఆర్టీ నోటిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం.. అభ్యర్థుల ఆగ్రహం

టీఆర్టీ నోటిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం.. అభ్యర్థుల ఆగ్రహం

టీఆర్టీ నోటిఫికేషన్ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 15న జిల్లాల వారిగా రోస్టర్ ఖాళీలను అందుబాటులో ఉంటాయన్న అధికారులు ఇప్పటివరకు వివరాలను అప్ లోడ్ చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ సెప్టెంబర్ 09వ తేదీన విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ.. కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. సెప్టెంబర్ 15న దీనికి సంబంధించి రోస్టర్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో పాటే.. సిలబస్, విద్యార్హత వంటి పూర్తి వివరాలు కూడా రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సెప్టెంబర్ 20 నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు (https://schooledu.telangana.gov.in/ISMS/) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.