
Trump Hotel Rental Scam: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నాయకుడే కాదు ఒక పెద్ద వ్యాపారవేత్తని మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు ట్రంప్ టవర్స్ పేరుతో రియల్టీ వ్యాపారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం మారిన ఏఐ సాంకేతిక యుగంలో మోసగాళ్లు ట్రంప్ పేరుతో ఇండియాలో ప్రజలను మోసం చేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.
నిందితులు ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతో దీనికోసం సాధారణ ప్రజల నుంచి పెట్టుబడి పేరుతో పెద్ద స్కామ్ చేశారు. కర్ణాటక వ్యాప్తంగా దాదాపు 800 మంది స్కామ్ లో చిక్కుకుని రూ.2 కోట్లకు పైగా పోగొట్టుకున్నట్లు తేలింది. దీనిపై పోలీసులు దాదాపు 200 కేసుల నమోదైనట్లు వెల్లడించగా.. అయితే నిందితులు ప్రజలను నమ్మిచ్చేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఏఐ ద్వారా ఒక వీడియోతో పాటు ఆయనకు సంబంధించిన ఫొటోలను వినియోగించినట్లు తేలింది. దీనిని చూసినవారెవరైనా నిజమే అనుకునే స్థాయిలో దానిని నిందితులు తయారు చేశారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు మోసపూరిత స్కామ్ దాదాపు 5-6 నెలల నుంచి కొనసాగుతోందని చెబుతున్నారు. నిందితులు పెట్టుబడిదారులకు తక్కువ కాలంలోనే 100 శాతం రాబడులతో పాటు ఉద్యోగ అవకాశాల పేరుతో ఎరవేసినట్లు తేలింది. వాళ్లు సూచించిన టాస్క్స్ చేస్తే పెట్టుబడి మెుత్తం పెరుగుతున్నట్లు యాప్ లో బ్రమింపచేశారు. తొలినాళ్లలో దీని నుంచి చిన్న మెుత్తాల్లో మాత్రమే డబ్బును విత్ డ్రా చేసేందుకు నిందితులు అనుమతించారు. తద్వారా పెద్ద పెట్టుబడులను ఆకర్షించాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
►ALSO READ | Jio Financial: అంబానీకి సెబీ గ్రీన్ సిగ్నల్.. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ షురూ..
స్కామ్ లో ఇరుకున్న లాయర్ తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నాడు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మోసగాళ్లు తనకు రోజు రూ.30 చొప్పున చెల్లిస్తూ వచ్చారని, అలా తనను ఎక్కువ మెుత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని చెప్పాడు. దీనివల్ల చివరికి తాను రూ.6 లక్షల నష్టపోయినట్లు వెల్లడించాడు. డబ్బు వెనక్కి తీసుకుందామని అనుకున్నప్పులు టాక్స్ పేరుతో హోల్డ్ చేశారని చెప్పాడు. ఈ మోసానికి సంబంధించి బెంగళూరు, తుమ్కూరు, మంగళూరు, హుబ్లీ, ధార్వాడ్, కాలాబుర్గి, శివమెుగ్గ, బళ్లారి, బీదర్ ప్రాంతాల్లో ఎక్కువ మంది మోసపోయినట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల డిజిటల్ మోసానికి సంబంధించి ఆధారాలను పసిగట్టే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. ఈ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, వాటిని ఏం చేస్తున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.